మహారాష్ట్రలో హాట్ టాపిక్ గా మారిన షిండే చర్యలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కలత చెందారని, అందుకే మహాయుతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకుని స్వగ్రామానికి కూడా వెళ్లారని కథనాలు వచ్చాయి.

By Medi Samrat  Published on  30 Nov 2024 6:01 PM IST
మహారాష్ట్రలో హాట్ టాపిక్ గా మారిన షిండే చర్యలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కలత చెందారని, అందుకే మహాయుతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకుని స్వగ్రామానికి కూడా వెళ్లారని కథనాలు వచ్చాయి. వీటిని శివసేన తోసిపుచ్చింది. షిండే అస్వస్థతకు గురయ్యారని అందుకే ఆయన మీటింగ్ ను రద్దు చేసుకున్నారని శివసేన తెలిపింది. ఏక్ నాథ్ షిండే మనస్తాపం చెంది సొంత ఊరుకు వెళ్లారని చెప్పడం సరికాదని, ఆయన బాధపడే వ్యక్తి కాదని శివసేన తెలిపింది. షిండే మహారాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడతారని మాజీ మంత్రి ఉదయ్ సమంత్ తెలిపారు.

బీజేపీ-శివసేన-ఎన్‌సిపి కూటమి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 233 స్థానాలను కైవసం చేసుకుంది, బీజేపీ రికార్డు స్థాయిలో 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన కు 57 , ఎన్సీపీకి 41 స్థానాలు దక్కాయి. అయితే ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా కూడా ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో కూటమి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏక్నాథ్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం శాఖను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉండాలని బీజేపీ పట్టుబట్టింది. ప్రభుత్వ ఏర్పాటుకు తాను అడ్డుగా ఉండనని, ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని షిండే పలు సందర్భాల్లో చెప్పారు.

Next Story