ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండోసారి సుదీర్ఘంగా విచారించింది. ఈరోజు ఉదయం 11 గంటలకు కవిత ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యింది. సుమారు 10 గంటల పాటు ఈడీ అధికారులు కవితను విచారించారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్ ఆరోపణలతో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటికి రెండుసార్లు విచారించింది. రాత్రి 9 గంటలు దాటినా తర్వాత కవిత విచారణ ముగిసింది. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీసు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విచారణ అనంతరం అనంతరం బయటకు వచ్చిన కవిత విజయ చిహ్నం చూపుతూ.. తన కాన్వాయ్‌లో బయల్దేరారు.