'కెట్టో ప్లాట్‌ఫారమ్' నిధుల సేకరణ మోసం కేసు.. జర్నలిస్టు రానా అయ్యూబ్‌పై ఈడీ ఫిర్యాదు
ED files prosecution plaint against journalist Rana Ayyub in 'Ketto platform' fund-raising fraud. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సీనియర్ జర్నలిస్ట్ రాణా అయ్యూబ్
By అంజి Published on 13 Oct 2022 10:48 AM GMTఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సీనియర్ జర్నలిస్ట్ రాణా అయ్యూబ్‌పై ఫిర్యాదును దాఖలు చేశారు. రాణా అయ్యూబ్ ఛారిటీ పేరుతో కోట్లలో డబ్బులు కాజేసిందని ఈడీ ఆరోపిస్తోంది. కిట్టో.కామ్ (Ketto.com) వెబ్‌సైట్ ద్వారా సహాయం, దాతృత్వం పేరుతో సేకరించిన నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఆమెపై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ ఫిబ్రవరిలో రూ. 1.77 కోట్లను అటాచ్ చేసింది. తాజాగా ఛార్జి షీట్ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. రానా అయ్యూబ్ కు చెందిన రూ. 1.77 కోట్లను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఫిబ్రవరిలో స్తంభింప చేసింది. సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రజల నుంచి సేకరించిన నిధులతో మనీ లాండరింగ్ కు పాల్పడిందంటూ ఈడీ ఆరోపించింది. రానా అయ్యూబ్ నిధులను దుర్వినియోగం చేశారని, వ్యక్తిగత ఖర్చుల కోసం నిధులను మరో ఖాతాలోకి మళ్లించారని ఈడీ అధికారులు చెబుతున్నారు. రాణా అయ్యూబ్ కోవిడ్ -19 సాయం సాకుతో ప్రజలను మోసం చేసి, ఆ నిధులను ఆమె వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
రానా అయ్యూబ్ మూడు ఫండ్ రైజర్ క్యాంపెయిన్ లను 'Ketto platform' ద్వారా ఏప్రిల్ 2020న మొదలుపెట్టారు. 2,69,44,680 రూపాయల ఫండ్స్ ను సేకరించారు. ఈ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ లకు 1. మురికివాడల్లో నివాసితులు & రైతుల కోసం నిధుల సేకరణలో సహాయం. 2. అస్సాం, బీహార్ మరియు మహారాష్ట్రలకు సహాయక చర్యలు 3. భారతదేశంలో కోవిడ్ 19 ద్వారా ప్రభావితమైన వారికి సహాయం చేయడానికి రాణా అయ్యూబ్, ఆమె బృందానికి సహాయం చేయండి ( 1. Help in raising funds for slum dwellers & farmers. 2.Relief work for Assam, Bihar and Maharashtra and 3. Help Rana Ayyub and her team to help those impacted by Covid19 in India) ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్-'కెట్టో'లో నిధుల సమీకరణను రాణా ప్రారంభించింది. స్వచ్ఛంద సంస్థ పేరుతో సాధారణ ప్రజల నుండి అక్రమంగా నిధులు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ లేకుండానే రాణా అయ్యూబ్ విదేశీ విరాళాలు అందుకున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో సేకరించిన నిధులు ఆమె తండ్రి, సోదరి ఖాతాలలోకి తరలించినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేయబడినట్లు ED దర్యాప్తులో తేలింది. " రానా అయ్యూబ్ ఈ నిధులనురూ. 50 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లను సృష్టించడానికి ఉపయోగించారు. రూ. 50 లక్షలను కొత్త బ్యాంక్ ఖాతాలో కూడా బదిలీ చేశారు. సహాయక చర్యల కోసం కేవలం రూ. 29 లక్షలు మాత్రమే ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. సహాయక చర్యల కోసం మరిన్ని ఖర్చులను క్లెయిమ్ చేయడానికి రాణా అయ్యూబ్ నకిలీ బిల్లులు సమర్పించారు" అని ED అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా ఈడీ రూ.1,77,27,704/- (రూ. 50 లక్షల ఎఫ్‌డీతో సహా) స్వాధీనం చేసుకుంది. సాధారణ ప్రజల నుండి వచ్చిన నిధులను ఆమె మనీలాండరింగ్ చేసారని అధికారులు తెలిపారు. రానా అయ్యూబ్ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ప్రకారం అవసరమైన ఆమోదం లేదా రిజిస్ట్రేషన్ లేకుండా ఈ నిధులను విదేశాల నుండి పొందారని అధికారులు తెలిపారు.