ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్‌కు కరోనా

Economist Amartya Sen tests Covid positive. ప్రముఖ భారత ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌కు కరోనా సోకింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం

By అంజి  Published on  9 July 2022 12:11 PM GMT
ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్‌కు కరోనా

ప్రముఖ భారత ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌కు కరోనా సోకింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అమర్త్యసేన్ శాంతినికేతన్‌లోని తన ఇంట్లో హోమ్‌ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. జులై 1న అమర్త్యసేన్ శాంతినికేతన్‌లోని తన ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.

షెడ్యూల్ ప్రకారం.. అమర్త్యసేన్‌ ఇవాళ శాంతినికేతన్ ఇంటి నుండి కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. కోల్‌కతాలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. జులై 10న లండన్ వెళ్లాల్సి ఉండగా.. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా వాటన్నింటినీ రద్దు చేశారు. కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం.. అమర్త్యసేన్ శాంతినికేతన్‌లోని తన ఇంట్లో ఉన్నారు. అక్కడే చికిత్స పొందుతున్నారు. వైద్యుల సలహా మేరకు నడుచుకుంటున్నారు.

ఇదిలావుండగా.. భార‌త్‌లో క‌రోనా వైర‌స్ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఇటీవ‌లే ఒమిక్రాన్ కు చెందిన మ‌రో కొత్త స‌బ్ వేరియంట్‌ను భార‌త్ లో గుర్తించామ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించిన క్ర‌మంలో కేసులు, మ‌ర‌ణాలు పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది.

Next Story