ఒక్కసారిగా పెరిగిన వీక్షకుల సంఖ్య.. ఈసీ వెబ్‌సైట్‌ క్రాష్!

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి.

By అంజి  Published on  3 Dec 2023 7:03 AM GMT
ECI Website Crashes,  Social Media, Assembly Election Results

ఒక్కసారిగా పెరిగిన వీక్షకుల సంఖ్య.. ఈసీ వెబ్‌సైట్‌ క్రాష్!

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి కౌంటింగ్‌ నిర్వహిస్తుండటంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫలితాల కోసం పెద్ద సంఖ్యలో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈసీ వెబ్‌సైట్‌పై విపరీతమైన లోడ్‌ పడింది. దాని వల్ల వెబ్‌సైట్‌ క్రాష్‌ అయినట్టు తెలుస్తోంది. తమకు ఈసీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడం లేదని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. దీంతో ఫలితాలు అప్డేట్‌ వెంటనే తెలియడం లేదని చెబుతున్నారు. ఉదయం 9 గంటలకు కూడా వెబ్‌సైట్ ఎలాంటి ట్రెండ్స్‌ను చూపలేదని యూజర్లు ఫిర్యాదు చేశారు. ఈ పోస్టులు ఎన్నికల సంఘం దృష్టి వచ్చాయి. దీంతో అధికారులు ఈ సమస్యను పరిష్కరిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3 ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల 2023 కౌంటింగ్ సోమవారం జరుగుతుంది. అనేక వార్తా ఛానెల్‌లతో ప్రారంభ ట్రెండ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రజలు ఈసీఐ వెబ్‌సైట్ https://results.eci.gov.in/లో ఎలాంటి ట్రెండ్‌లను చూడలేకపోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) 2-2 తేడాతో గెలుస్తాయని అంచనా వేయగా, ట్రెండ్స్ కూడా ఇదే సంఖ్యను సూచించాయి. ప్రారంభ పోకడల ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బిజెపి ఆధిక్యంలో ఉండగా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

Next Story