జమ్ముకశ్మీర్‌లో భూమి కంపించింది. పహల్గామ్‌లో బుధవారం ఉదయం 5.43 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.2గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రాన్ని పహల్గామ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. కాగా.. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఈ నెల 5న కశ్మీర్ లోయ సహా జమ్ము డివిజన్‌లో భూ కంపం సంభవించింది. 5న ఉదయం 9.45 సమయంలో 5.9 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రం 180 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు.