విద్యార్థినుల ముందు బట్టలు విప్పిన టీచర్.. ప్రిన్సిపాల్ ను కూడా..!
Drunk teacher took off clothes in front of students.విద్యార్థినుల ముందు బట్టలు విప్పాడు ఆ టీచర్.. ఆ తర్వాత ఏమిటయ్యా
By M.S.R Published on 13 Jan 2022 6:58 AM GMTవిద్యార్థినుల ముందు బట్టలు విప్పాడు ఆ టీచర్.. ఆ తర్వాత ఏమిటయ్యా చేస్తున్నావని ప్రశ్నించడానికి వచ్చిన ఏ ఒక్కరి మాటలను వినలేదు. మద్యం మత్తులో ఒళ్లు మరచి ప్రవర్తించాడు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లా కొట్రా ప్రాంతానికి చెందిన ఓ టీచర్ తాగిన మత్తులో తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు పాఠశాలలో విద్యార్థుల ముందే బట్టలు విప్పడమే కాకుండా సిబ్బందితో, గ్రామస్తులతో వాగ్వాదానికి దిగి మూడు గంటలపాటు రచ్చ చేశాడు.
కొట్రాలోని ఖజురియా స్కూల్‌కు చెందిన ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (పిటిఐ) దేవిలాల్ మీనా మధ్యాహ్నం 12 గంటలకు మత్తులో పాఠశాలకు చేరుకున్నాడు. ప్రిన్సిపాల్ అలోక్ శర్మ, ఇతర ఉపాధ్యాయులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. మీరు తాగి ఉన్నారు.. ఇంటికి వెళ్లండని కోరారు. కానీ అతడు పట్టించుకోలేదు. నిందిత ఉపాధ్యాయుడు ప్రిన్సిపాల్‌ను గోళ్లతో గాయపరచి, తోటి ఉపాధ్యాయులు బాబూలాల్ ఖేర్, భగవతీలాల్‌లను కొరికాడు.
మద్యం మత్తులో ఉన్న టీచర్ అక్కడున్న వాళ్లందరినీ చంపేస్తానని బెదిరించాడు.అందరి ముందు బట్టలు ఒక్కొక్కటిగా తీయడం ప్రారంభించాడు. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో 200 మందికి పైగా విద్యార్థులు అక్కడ ఉన్నారు. టీచర్‌ను ఈ స్థితిలో చూసిన పలువురు విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అక్కడ ఉన్న ప్రజలను కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. మరింత మంది గ్రామస్థులు అక్కడికి చేరుకోగా, వారిని కూడా కొట్టడం ప్రారంభించాడు.
అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీచర్ మద్యం సేవించి పాఠశాలలో పలుమార్లు వీరంగం సృష్టించినట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా పోలీసులు అతడిని పట్టుకుని కొంత సమయం తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. ఇప్పుడైనా అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ప్రిన్సిపాల్ అలోక్ శర్మ సీబీఈవో, డీఈఈవో, జిల్లా విద్యాశాఖాధికారికి లేఖ రాశారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజస్థాన్ బాలల కమిషన్‌కు కూడా చేరింది.