'నేను ఓటే వేయలేదు.. నా వేలికి సిరా గుర్తు ఎలా వచ్చింది'.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయించిన వ్యక్తి

తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్‌లో మంగళవారం 40 ఏళ్ల వ్యక్తి పోలీసులను ఆశ్రయించి, నేటి ఎన్నికలకు ముందు తన వేలికి చెరగని సిరా గుర్తు ఉందని చెప్పాడు .

By అంజి  Published on  5 Feb 2025 7:27 AM IST
Drunk Delhi man, finger was inked, voting, police, Delhi polls

'నేను ఓటే వేయలేదు.. నా వేలికి సిరా గుర్తు ఎలా వచ్చింది'.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయించిన వ్యక్తి

తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్‌లో మంగళవారం 40 ఏళ్ల వ్యక్తి పోలీసులను ఆశ్రయించి, నేటి ఎన్నికలకు ముందు తన వేలికి చెరగని సిరా గుర్తు ఉందని చెప్పాడు . అతన్ని విచారించినప్పుడు, ఆ వ్యక్తి తాగి ఉన్నట్లు తేలింది. ఎవరి వేళ్లకూ సిరా వేయలేదని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తిని కైలాష్ నగర్ ప్రాంతానికి చెందిన హిస్టరీ షీటర్ ఫిరోజ్ ఖాన్‌గా గుర్తించారు, అతనిపై దాదాపు 15 కేసులు నమోదయ్యాయి. విచారణ సమయంలో.. మీడియా దృష్టిని ఆకర్షించడానికి తాను ఆ కథను కల్పించానని ఖాన్ అంగీకరించాడు.

ఈ ఆరోపణ వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉందా అని తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని రాబోయే ఐదు సంవత్సరాలకు ఎన్నుకునేందుకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. 1.56 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.శనివారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 70 నియోజకవర్గాల్లోని 699 మంది అభ్యర్థుల భవితవ్యం త్వరలో వెలువడనుంది.

Next Story