భార‌త రాష్ట్రపతి జీతం ఎంత‌..? ఎలాంటి సౌక‌ర్యాలు ఉంటాయంటే..?

Droupadi Murmu Elected Indian President What Will Be Her Salary.భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 July 2022 7:46 AM GMT
భార‌త రాష్ట్రపతి జీతం ఎంత‌..? ఎలాంటి సౌక‌ర్యాలు ఉంటాయంటే..?

భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ముర్ము ఘ‌న విజ‌యం సాధించారు. ప్ర‌పంచ‌లోనే అతిపెద్ద‌దైన ప్ర‌జాస్వామ్య దేశానికి గిరిజన వర్గానికి చెందిన తొలి రాష్ట్రపతిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రతిభా పాటిల్ తరవాత రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో మహిళగా నిలిచారు. మ‌రి దేశ అత్యున్న‌త పీఠంపై ఆమె ఎంత వేత‌నం అందుకోబోతున్నారు..? ఎలాంటి వాహ‌నంలో ప్ర‌యాణిస్తున్నారు..? ప‌ద‌వి విమ‌ర‌ణ త‌రువాత పొందే ప్ర‌యోజ‌నాలు ఏంటి..? వంటి ప్ర‌శ్న‌లు స‌మాధానాలు తెలుసుకుందాం.

రాష్ట్రపతికి జీతం ఎంతంటే..?

- రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తికి నెలకు రూ.5 లక్షల వేతనం అందుకుంటారు. 2017 వ‌ర‌కు రాష్ట్రపతి జీతం రూ.1.5లక్షలుగా ఉండగా తరవాత దాన్ని రూ.5 లక్షలకు పెంచారు.

ఎక్కడ ఉంటారు..?

రాష్ట్ర‌ప‌తి అధికారిక నివాసం- రాష్ట్రపతి భవన్‌. దీన్ని 1929లో నిర్మించారు. దేశంలో బ్రిటీష్ పాల‌న ఉన్న‌ప్పుడు ఈ భ‌వనాన్ని వైస్త్రాయ్ నివాసంగా ఉప‌యోగించారు. ఇందులో మొత్తం 340 గదులుంటాయి. రెసిప్షన్ హాల్స్, గెస్ట్ రూమ్స్, ఆఫీసులు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ప్రెసిడెంట్ ఎస్టేట్‌ ఉంటుంది. ఇందులో పెద్ద పెద్ద గార్డెన్‌లు, ఓపెన్‌ స్పేసెస్, బాడీగార్డ్స్‌, సిబ్బంది ఇళ్లు ఉంటాయి.



ఎలాంటి కార్ల‌లో ప్రయాణిస్తారు..?

రాష్ట్రపతి ప్రీమియమ్ కార్లలోనే ప్రయాణిస్తారు. సెక్యూరిటీ సిస్టమ్‌తో కూడిన బుల్లెట్, షాక్‌ప్రూఫ్‌ కార్‌ను అందిస్తారు. దానికి లైసెన్స్ ప్లేట్ ఉండదు. గత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మెర్సిడెస్ మేబాచ్ S600 పుల్‌మన్ గార్డ్‌లో ప్రయాణించేవారు. ఈ కార్‌ బులెట్స్‌ని, బాంబు దాడులను తట్టుకోగలదు.

భద్రత..?

భారత సాయుధ బలగాలకు చెందిన సైనికులే రాష్ట్రపతికి బాడీగార్డ్‌లుగా ఉంటారు. త్రివిధ దళాలకు చెందిన సైనికులు రక్షణ కల్పిస్తారు.

రిటైర్ అయ్యాక వచ్చే బెనిఫిట్స్ ఏంటి..?

రాష్ట్రపతిగా రిటైర్ అయిన వారికి ఏడాదికి రూ.1.5 లక్షల పెన్షన్ అందుతుంది. ప్రెసిడెంట్‌ జీవితభాగస్వామికి నెలకు రూ.30,000 పెన్షన్ ఇస్తారు. ఎలాంటి అద్దె చెల్లించకుండానే పెద్ద బంగ్లాలో నివసించేందుకు అవకాశముంటుది. ఐదుగురు ఉద్యోగులను నియమించుకునే వెసులుబాటు ఉంటుంది.

వెకేషన్‌కి వెళ్లినప్పుడు ఎక్కడ ఉంటారు..?

దక్షిణాదిన ఓ రీట్రీట్ బిల్డింగ్, ఉత్తరాన ఓ రీట్రీట్ బిల్డింగ్ అందుబాటులో ఉంటాయి. దక్షిణ భారత్‌లో హైదరాబాద్‌లోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయం ఉంది. ఉత్తరాదిన సిమ్లాలోని మశోబ్రాలో రీట్రీట్ బిల్డింగ్ ఉంటుంది.

Next Story