డ్రోన్ కూల్చివేత‌.. ఐదు కిలోల పేలుడు ప‌దార్ధాలు స్వాధీనం

Drone shot down in Jammu and Kashmir's Kanachak area.జమ్మూకశ్మీర్‌లో భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2021 10:39 AM IST
డ్రోన్ కూల్చివేత‌.. ఐదు కిలోల పేలుడు ప‌దార్ధాలు స్వాధీనం

జమ్మూకశ్మీర్‌లో భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. కాగా.. శుక్ర‌వారం పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్‌ను భద్రతా దళాలు నేలకూల్చాయి. జ‌మ్మూక‌శ్మీర్‌లోని క‌నాచ‌క్‌లో ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆ డ్రోన్ నుంచి 5 కిలోల‌ పేలుడు ప‌దార్ధాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై జమ్మూ కశ్మీర్‌ పోలీస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. కనాచక్‌ ఏరియాలో ఓ డ్రోన్‌ను నేలకూల్చాము. దానినుండి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నాము. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంద‌న్నారు.

అయితే జమ్మూ లేదా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో డ్రోన్‌ కనిపించడం ఇదేమి మొదటిసారి కాదు. గత నెలలో కూడా ఓ డ్రోన్‌ గుర్తించారు. డోన్‌లతో దాడులకు పాల్పడే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ తన సిబ్బందికి జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్బార్‌సింగ్‌ సూచించారు. కాగా.. భారత ప్రభుత్వం 2019, ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకహోదా కల్పిస్తున్న అధికరణం 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు విఘాతం కలిగించేందుకు నగరంలోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని భద్రతా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో నగరంలో అశాంతిని సృష్టించడానికి ఉగ్రమూకలు పెద్ద కుట్రనే పన్నుతున్నాయని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి.

Next Story