స్నాప్‌చాట్ చూస్తూ డ్రైవింగ్.. నదిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి
భోపాల్‌లోని కోలార్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదం జరిగింది.
By అంజి Published on 17 Jan 2025 8:34 AM ISTస్నాప్‌చాట్ చూస్తూ డ్రైవింగ్.. నదిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి
భోపాల్‌లోని కోలార్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు 50 అడుగుల కెర్వా నదిలోకి పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరొకరు గాయపడ్డారు. స్నాప్‌చాట్‌తో పరధ్యానంలో ఉన్న డ్రైవర్.. వంతెనపై మలుపు తిరుగుతున్నప్పుడు వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. మృతులను కారు నడుపుతున్న వినీత్ (22), పలాష్ గైక్వాడ్ (22)గా గుర్తించారు. గాయపడిన పియూష్ గజ్భియే (24) తప్పించుకుని అధికారులను అప్రమత్తం చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం, ప్రమాద సమయంలో వినీత్ అతివేగంతో పాటు స్నాప్‌చాట్‌ను ఉపయోగిస్తున్నాడు. బ్రిడ్జిపై మలుపు తిప్పే ప్రయత్నంలో వాహనంపై నియంత్రణ కోల్పోయి. కారు అడ్డంకి గుండా కిందపడి నదిలోకి దూసుకెళ్లింది. కారు డోర్లు లాక్ కావడంతో లోపల ఉన్న ముగ్గురూ చిక్కుకుపోయారు. ఈ క్రమంలో పీయూష్ కారు విండోని పగులగొట్టి తప్పించుకోగలిగాడు. వెంటనే జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కారు అద్దాలను పగులగొట్టి వినీత్, పలాష్ మృతదేహాలను వెలికి తీయడానికి పనిచేశారు. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారని, వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షలకు తరలించారు. పీయూష్‌ను ఆసుపత్రిలో చేర్చారు, ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.