'ఆకాశ్‌ ప్రైమ్‌' టెస్ట్‌ సక్సెస్‌.. ఆర్మీకి మరింత దన్ను..!

DRDO tests Akash Prime missile.తాజాగా చేపట్టిన ఆకాశ్‌ క్షిపణి కొత్త వెర్షన్‌ సక్సెస్‌ అయినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి

By అంజి  Published on  28 Sep 2021 2:13 AM GMT
ఆకాశ్‌ ప్రైమ్‌ టెస్ట్‌ సక్సెస్‌.. ఆర్మీకి మరింత దన్ను..!

తాజాగా చేపట్టిన ఆకాశ్‌ క్షిపణి కొత్త వెర్షన్‌ సక్సెస్‌ అయినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తెలిపింది. ఆకాశ్‌ క్షిపణి కొత్త వెర్షన్‌ 'ఆకాశ్ ప్రైమ్‌' టెస్ట్‌ రన్‌ను ఒడిశా రాష్ట్రంలోని చండీపూర్‌ ఇంటిగ్రేడెట్‌ టెస్ట్‌ రేంజ్‌లో నిర్వహించారు. క్షిపణి కొత్త వెర్షన్‌ను అభివృద్ధి చేసిన తర్వాత తొలిసారి పరీక్ష నిర్వహించినట్లు డీఆర్డీవో పేర్కొంది. ఈ క్షిపణి శుత్రు విమానాలు అనుకరించే మానవరహిత విమాన లక్ష్యాన్ని నాశనం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆకాశ్‌ క్షిపణితో పోలిస్తే.. ఇది మెరుగైన ఖచ్చితత్వం కోసం స్వదేశీ యాక్టివ్‌ ఆర్‌ఎఫ్‌ సీకర్‌ని కలిగి ఉంది. అధిక ఎత్తులో, తక్కువ ఉష్ణోగ్రత వాతావరణంలో కూడా ఆకాశ్ ప్రైమ్‌ క్షిపణి మెరుగైన పనితీరును కనబరుస్తుందని అధికారులు తెలిపారు.

తాజాగా ఆకాశ్‌ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. కాగా ఆకాశ్‌ ప్రైమ్‌ క్షిపణి విజయవంతం కావడం పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డీఆర్డీవోను అభినందించారు. ప్రపంచ స్థాయి క్షిపణులను రూపొందించడంలో డీఆర్డీవో తన సామర్థ్యాన్ని చూపించిందని రాజ్‌నాథ్‌ అన్నారు. అలాగే క్షిపణి విజయవంత ప్రయోగంలో పాల్గొన్న బృందాన్ని డీఆర్డీవో చైర్మన్‌ జి.సతీష్‌ రెడ్డి అభినందించారు. టెస్టులో సక్సెస్‌ సాధించిన ఆకాశ్‌ ప్రైమ్‌ క్షిపణి భారత ఆర్మీకి మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించింది.

Next Story