కరోనా వ్యాక్సిన్ మూడో డోస్ వేయాల్సిందేనట..!

DR Randeep Guleria about covid booster shot.కరోనా మహమ్మారిని అడ్డుకోడానికి వ్యాక్సిన్లు తప్పనిసరి అని చెబుతున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2021 10:30 AM GMT
కరోనా వ్యాక్సిన్ మూడో డోస్ వేయాల్సిందేనట..!

కరోనా మహమ్మారిని అడ్డుకోడానికి వ్యాక్సిన్లు తప్పనిసరి అని చెబుతున్నారు. అయితే రెండు డోసులు వేసుకున్న తర్వాత కూడా మహమ్మారి పలువురిని కలవరబెడుతూ ఉండడంతో.. బూస్టర్ డోస్.. థర్డ్ డోస్ కు సంబంధించిన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మూడో డోస్ కూడా వేయాల్సి ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ల ను ఎదుర్కొనే కొత్త క‌రోనా వైర‌స్ కూడా పుట్టుకురావ‌చ్చ‌ని కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.

క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారిలో డెల్టా వేరియంట్ క‌న‌ప‌డుతోంది. మానవ రోగ నిరోధక శ‌క్తిని ఎదుర్కొంటూ క‌ల‌వ‌ర‌పెడుతోంది. రెండు డోసుల‌ టీకా తీసుకున్న వారిలోనూ ఈ వేరియంట్‌ వైరల్‌ లోడు అధికంగా ఉంటోంది. దీంతో వారి నుంచి ఇత‌రుల‌కు వ్యాపించే అవ‌కాశాలు అధికంగానే ఉంటున్నాయి. రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో కొంత కాలానికి యాంటీబాడీలు తగ్గిపోతున్నాయి. దీంతో బూస్టర్ డోసు త‌ప్ప‌నిస‌రి అని అంటున్నారు. మూడో డోసు వేయించుకుంటే శ‌రీరంలో యాంటీబాడీలు తిరిగి గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. యాంటీబాడీలు శరీరంలో దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని.. డెల్టా వంటి వేరియంట్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌చ్చ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు దేశాలు మూడో డోసు వేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి.

ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా బూస్టర్ డోస్ పై చర్చ జరుగుతోందని ఇటీవల వ్యాఖ్యలు చేశారు. బూస్టర్‌ డోస్‌పై ప్రస్తుతం భారత్‌లో అవసరమైన డేటా లేదని, అయితే వచ్చే ఏడాది మొదట్లో సమాచారం అందుబాటులో ఉండే అవకాశం ఉందన్నారు. కరోనా నుండి మూడో మోతాదుతో అధిక రక్షణ లభిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్‌లో డేటా ప్రస్తుతం బూస్టర్‌ డోస్‌ అవసరమని చెప్పడానికి ప్రస్తుతం తమ వద్ద తగినంత డేటా ఉందని అనుకోనని.. వ్యాక్సిన్లు అందించే రక్షణపై పూర్తి డేటా ఉండాలన్నారు. ఇందుకు పరిశోధన అవసరమని, దీనికి మరికొద్ది నెలలు సమయం పడుతుందన్నారు. బహుశా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి బూస్టర్‌ డోస్‌ ఏంటి? ఎవరికి అవసరం? అనే డేటా అందుబాటులోకి వస్తుందని అన్నారు.

Next Story