గృహహింస చట్టం అత్తకు వర్తిస్తుందా?

సాధారణంగా గృహహింస చట్టం కోడళ్లకే వర్తిస్తుందని అనుకుంటారు. కానీ ఇది ఇంట్లో ఇతరుల వల్ల ఇబ్బంది పడే మహిళలందరికీ వర్తిస్తుంది.

By అంజి  Published on  12 Feb 2025 9:30 AM IST
domestic violence act, aunt, Law

గృహహింస చట్టం అత్తకు వర్తిస్తుందా?

సాధారణంగా గృహహింస చట్టం కోడళ్లకే వర్తిస్తుందని అనుకుంటారు. కానీ ఇది ఇంట్లో ఇతరుల వల్ల ఇబ్బంది పడే మహిళలందరికీ వర్తిస్తుంది. అత్తింట్లో కోడలు ఎలాంటి ఇబ్బంది పడ్డా.. వాళ్ల మీద కంప్లయింట్‌ ఇవ్వవచ్చు. ఒక వేళ కోడలు అత్తను ఇబ్బంది పెట్టినా, హింసించినా ఈ చట్టం వర్తిస్తుందా? అనే అనుమానం చాలా మందికి ఉంది. ఈ చట్టం ప్రకారం.. అత్తలు కూడా వారి కోడళ్ల మీద ఫిర్యాదు ఇవ్వవచ్చు.

తమను దూషించినా, ఆరోగ్యం బాగోలేనప్పుడు చూసుకోకపోయినా కోడళ్లపై ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస చట్టంలోని సెక్షన్‌ 2 బాధిత వ్యక్తికి ప్రతివాదితో గృహ సంబంధం ఉంటే ఇది వర్తిస్తుందని అని తెలియజేస్తోంది. అంటే భార్య, భర్త, బావ, అత్త, మామ, కోడలు మాత్రమే కాదు తండ్రి, కొడుకు, కూతురు, సోదరి, ఆఖరికి సహజీవనం చేస్తున్నా, చట్టబద్ధత లేకున్నా రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తులకు కూడా చట్టపరంగా రక్షణ కల్పిస్తోంది.

Next Story