డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీన జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం.. 1962లో భారతదేశపు రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాధాకృష్ణన్‌ను కలిసిన విద్యార్థులు.. ఆయన పుట్టిన రోజున వేడుకలు జరుపుకునేందుకు అనుమతించాలని అభ్యర్థించారు. అందుకు నిరాకరించిన సర్వేపల్లి.. ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా పాటించాలని కోరారు. ఇక అప్పటి నుంచి ఆయన జన్మదినాన ఉపాధ్యాయ దినోత్సవావన్ని నిర్వహించుకుంటున్నాం..
సర్వేపల్లి గురించి మరిన్ని విశేషాలు
సర్వేపల్లి గొప్ప పండితుడు. ఆయన 16 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు.
ప్రాచీన కాలం నుంచే శ్రీకృష్ణుడిని గురువుగా.. అర్జునుడిని శిశ్యుడిగా పిలుస్తుంటారు సర్వేపల్లి. గురుశిశ్యుల బంధానికి వారు ప్రతీకలు కాబట్టి.
1952 - 1962 మధ్య ఉపరాష్ట్రపతిగా, 1962-1967 మధ్య రెండో రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ సేవలు అందించారు.
సర్వేపల్లి ఫిలాసపీఫై మక్కువ పెంచుకుని.. ఆ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ కూడా పొందారు. ఆ తర్వాత సర్వేపల్లిని యూనివర్సిటీల్లో ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా అప్పటి రాజులు ఎంపిక చేశారు. ఆ విధంగా పిల్లలకు బోధించడం ప్రారంభించారు.