ఈ జలపాతానికి 'అమితాబ్ బచ్చన్' పేరేలా వచ్చిందంటే?
Do you know how the waterfall got its name from Amitabh Bachchan?. వాటర్ ఫాల్స్.. ప్రకృతి అందాలకు నిలువెత్తు నిదర్శనాలు. ఎత్తైన కొండల నుంచి ధారళంగా ప్రవహించే నీ
By అంజి Published on 23 Aug 2022 12:25 PM IST
వాటర్ ఫాల్స్.. ప్రకృతి అందాలకు నిలువెత్తు నిదర్శనాలు. ఎత్తైన కొండల నుంచి ధారళంగా ప్రవహించే నీరు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. అలాంటి వాటర్ ఫాల్స్ భారత్‌లో చాలానే ఉన్నాయి. సాధారణంగా వాటర్‌ఫాల్స్‌కు ఆ ప్రాంత వాసులు ఏదో ఒక పేరు పెడుతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటర్‌ఫాల్‌కు వెరైటీగా అమితాబ్ బచ్చన్ పేరు పెట్టారు. ఆ వాటర్‌ఫాల్‌కు బిగ్‌బీ పేరు ఎందుకు పెట్టారు? అది ఎక్కడ ఉంది?
అమితాబ్ బచ్చన్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన ఎత్తు. ఆయన 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉంటారు. ఈ వాటర్‌ఫాల్ కూడా చాలా ఎత్తులో ఉంటుంది. మిగతా వాటర్‌ఫాల్స్ కంటే పొడవుగా ఉంటుంది. అందుకే దీనిని అమితాబ్ వాటర్‌ఫాల్ స్థానికులు పిలవడం మొదలుపెట్టారు. ఈ వాటర్‌ఫాల్‌కు టూరిస్టుల తాకిడి ఎక్కువే. తన పేరు మీద వాటర్‌ఫాల్ ఉందనే విషయం 2019 వరకు బిగ్‌బీకి తెలియదు. ఓ ట్విటర్ యూజర్ ఈ వాటర్‌ఫాల్స్‌కు తన పేరును పెట్టారని తెలుసుకుని బిగ్‌బీ ఆశ్చర్యపోయారు.
ఈ వాటర్‌ఫాల్‌ను చూడాలంటే నార్త్ ఈస్ట్‌కు వెళ్లాలి. ఉత్తర సిక్కిం జిల్లాలోని లాచుంగ్‌లోని చుంగ్తాంగ్‌ని యుమ్‌తంగ్ వ్యాలీకి కలిపే రోడ్డ పక్కన ఇది ఉంది. ఇది ఎత్తైన జలపాతాల్లో ఒకటి. ఈ ఫాల్స్‌ను భిమ్‌నాలా లేదా భెవ్మా ఫాల్స్ అని కూడా అంటారు. లాచుంగ్ గ్రామం నుండి 13 కిలోమీటర్ల దూరంలో, గాంగ్‌టక్ నగరం నుండి 118 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 8,610 అడుగుల ఎత్తులో ఈ వాటర్‌ఫాల్ ఉంది. ఈ జలపాతాన్ని చేరుకోవడానికి లాచుంగ్ నుండి క్యాబ్ ద్వారా వెళ్లొచ్చు. గ్యాంగ్‌టక్ నుండి లాచుంగ్‌కు వెళ్లడానికి 6 గంటలు పడుతుంది, ఆపై లాచుంగ్ నుండి భేవ్మా జలపాతానికి మరో గంట పడుతుంది. చుట్టుపక్కల అడవులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.