ఉషా చిలుకూరి వాన్స్ గురించి మీకు తెలుసా?
భారతీయ-అమెరికన్ న్యాయవాది ఉషా చిలుకూరి వాన్స్ తన భర్త జెడి వాన్స్‌ను రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన రన్నింగ్ మేట్‌గా పేర్కొన్న తర్వాత జాతీయ దృష్టిలో పడ్డారు.
By అంజి Published on 16 July 2024 2:15 PM ISTఉషా చిలుకూరి వాన్స్ గురించి మీకు తెలుసా?
భారతీయ-అమెరికన్ న్యాయవాది ఉషా చిలుకూరి వాన్స్ తన భర్త జెడి వాన్స్‌ను రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన రన్నింగ్ మేట్‌గా పేర్కొన్న తర్వాత జాతీయ దృష్టిలో పడ్డారు. నవంబర్ 5న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లకు వ్యతిరేకంగా ట్రంప్, వాన్స్ గెలిస్తే.. 38 ఏళ్ల ఉష, మొదటి భారతీయ అమెరికన్ రెండవ మహిళ అవుతుంది. కాగా సోమవారంనాడు అమెరికా ఉపాధ్యక్ష పదవికి నామినేషన్‌ను అంగీకరించేందుకు రిపబ్లిక్ నేషనల్ కన్వెన్షన్ స్టేజ్ మీదకు వెళ్లినప్పుడు జేడీ వాన్స్ మీద పొగడ్తల వర్షం కురిసింది. కాగా భారతీయ వలసదారుల కుమార్తె, ఉష శాన్ డియాగో శివారులో పెరిగారు. ఆమె బాల్యం, టీనేజీ స్నేహితులు ఆమెను "నాయకురాలు", "పుస్తకాల పురుగు"గా అభివర్ణించారు. 2014 నాటికి, ఆమె రిజిస్టర్డ్ డెమొక్రాట్.
యేల్ లా స్కూల్‌లో గ్రాడ్యుయేట్ అయిన ఉష, ముంగెర్, టోల్లెస్ & ఓల్సన్ ఎల్‌ఎల్‌పీలో సివిల్ లిటిగేషన్ అటార్నీ. ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్‌కు క్లర్క్‌గా పనిచేశారు. డీసీ సర్క్యూట్ కోసం యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆమె జస్టిస్ బ్రెట్ కవనాగ్ కోసం క్లర్క్‌గా పని చేశారు. లా స్కూల్‌కు ముందు, ఆమె యేల్ నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందింది.
2013లో జెడి వాన్స్, ఉషా చిలుకూరి.. యేల్ లా స్కూల్‌లో తొలిసారి కలుసుకున్నారు. ‘సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా’’ అనే అంశంపై జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. 2014లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉషా, జేడీ వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇవాన్, వివేక్, మీరాబెల్ వారి పేర్లు. ఉషా తల్లిదండ్రులు భారత దేశం నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా హిందూ సంప్రదాయంలో పెరగగా, జేడీ వాన్స్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తారు. జేడీ వాన్స్ తరచూ భార్యను పొగుడుతుంటారు. ఆమెను తన యేల్ యూనివర్సిటీ ‘ఆధ్యాత్మిక గురువు’గా అభివర్ణించేవారు.