భయపెట్టే 'డుమాస్ బీచ్' గురించి తెలుసా?
Do you know about the scary 'Dumas Beach' . ఈ ప్రపంచంలో వింతలు, విశేషాలతో పాటు కొన్ని అంతుచిక్కని మిస్టరీలు కూడా ఉన్నాయి. చాలా వరకు మిస్టరీల కథలు
By అంజి Published on 21 Aug 2022 12:16 PM ISTఈ ప్రపంచంలో వింతలు, విశేషాలతో పాటు కొన్ని అంతుచిక్కని మిస్టరీలు కూడా ఉన్నాయి. చాలా వరకు మిస్టరీల కథలు దెయ్యాలతో రిలేట్ అయి ఉంటాయి. అలాంటి మిస్టరీ ప్రదేశమే భారత్‌లో కూడా ఒకటి ఉంది. అదే 'డుమాస్ బీచ్'. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఇష్టమున్న వారికి ఈ బీచ్ నచ్చుతుంది. బీచ్‌లో ఇసుక నల్లగా ఉంటుంది. అందుకే ఈ బీచ్‌ను చూస్తేనే కాస్త భయం కలుగుతుంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం నుండి 20 కి.మీ దూరంలో ఈ డుమాస్ బీచ్ ఉంది.
ఈ బీచ్ గురించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పగటి పూట ఈ బీచ్‌ను చూసేందుకు ఎంతో మంది వస్తారు. సాయంత్రం దాటాక మాత్రం ఎవరూ అటువైపు అడుగుపెట్టరు. రాత్రి పూట డుమాస్ బీచ్‌లో తిరగడం అంత సురక్షితం కాదని స్థానికులు చెబుతున్నారు. ఉదయం ప్రశాంతంగా ఉండే బీచ్ సాయంత్రం అయితే దెయ్యాల దిబ్బలా కనిపిస్తుందట. అలాగే బీచ్‌లో నడస్తున్న వారి చెవుల్లో గాలి శబ్దంతో పాటు ఎవరో మాట్లాడుకుంటున్నట్లు శబ్దాలు వినిపిస్తాయి. చుట్టు పక్కల చూస్తే మాత్రం ఎవరూ కనిపించరు. ఇక్కడ రాత్రి సమయంలో దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారం కూడా ఉంది. అందుకే ఈ బీచ్ దగ్గరికి పోవడానికి ప్రజలు భయపడుతారు.
డుమాస్ బీచ్ ఒకప్పుడు హిందూ శ్మశనవాటికి అని స్థానికులు చెబుతున్నారు. బీచ్ కింద ఎన్నో అస్థిపంజరాల గుట్టలు ఉన్నాయని ఓ కథనం ప్రజల్లో అల్లుకుంది. శ్మశాన వాటిక కాబట్టే ఇక్కడి ఇసుక బ్లాక్ కలర్‌లో ఉందని వాదన కూడా ఉంది. దెయ్యాల ఆత్మలు బీచ్‌లో తిరుగుతూ గుసగుసలాడుతూ ఉంటాయని, ఆ శబ్దాలే భయభ్రాంతులకు గురి చేస్తాయని అంటుంటారు. ఓ సారి బీచ్‌లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడట. అతడిని దెయ్యాలనే చంపాయని కథనం కూడా పుట్టుకొచ్చింది.