దేశ వ్యాప్తంగా ప్రముఖ ఆన్‌లైన్ ట్రాన్సక్షన్ యాప్ పేటీఎం సేవలకు శుక్రవారం అంతరాయం ఏర్పడింది. చాలా మంది పేటీఎం యాప్ పని చేయలేదని, వెబ్‌సైట్‌కి లాగిన్ చేయలేకపోయారు. పేటీఎం ట్రాన్సక్షన్‌లు జరగడం లేదని ఫిర్యాదులు అందాయి. ఆన్‌లైన్ యాప్స్ సేవలను పరిశీలించే డౌన్డిటెక్టర్రు శుక్రవారం ఉదయం 10గంటల నాటికే 611 ఫిర్యాదులు అందాయి. పేటీఎం పనిచేయడం లేదని 66 శాతం మంది వినియోగదారులు చెప్పారు. పేటీఎం యాప్‌లో సమస్యలు ఉన్నట్టు 29 శాతం మంది తెలిపారు. ఢిల్లీ, ముంబై , బెంగళూరు వంటి నగరాల్లో ప్రజలు పేటీఎం పనిచేయకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు.
ఈ విషయమై స్పందిస్తూ.. తమ యాప్‌లో నెట్వర్క్ సమస్యలు ఉన్నాయని పేటీఎం అంగీకరించింది. ఈ మేరకు ఉదయం 9:30కి ఓ ట్వీట్ చేసింది. తమ నిపుణుల బృందం సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్నట్టు తెలిపింది. తిరిగి పేటీఎంలో తలెత్తిన సమస్యలను ఉదయం 11:30 సమయంలో పరిష్కరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు యాప్ ఎప్పటిలాగానే పనిచేస్తోంది. కస్టమర్లు తమ తమతమ లావాదేవీలు చేసుకోగలుగుతున్నారు. పేటీఎం పనిచేయపోవడంతో సోషల్ మీడియాలో 'పేటీఎండౌన్' హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి.