రెండో బూస్టర్ డోస్‌పై చర్చ..!
Discussions begin in govt panel on 2nd booster dose.చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి
By తోట వంశీ కుమార్ Published on 3 Jan 2023 12:28 PM ISTచైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇక రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు పెట్టుకోవాలని చెప్పింది. కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది.
అర్హత కలిగిన వారిలో కేవలం 28 శాతం మంది మాత్రమే ఫస్ట్ బూస్టర్ డోస్ తీసుకున్నారు. గతేడాది జనవరిలో బూస్టర్ డోస్ అందుబాటులోకి వచ్చింది. తొలుత వృద్దులు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇచ్చారు. ఆ తరువాత అందరికి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతుండడంతో రెండో బూస్టర్ డోస్‌పై చర్చలు జరుగుతున్నాయని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ చెందిన ఓ నిపుణుడు తెలిపాడు. అయితే.. ప్రస్తుతం రెండో బూస్టర్ డోసు అవసరం లేదని, తొలుత మన దేశంలో ఇప్పటికే ప్రారంభించిన బూస్ట్‌ర్ డోస్ డ్రైవ్‌ను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,51,186 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయగా 134 మందికి పాజిటివ్‌గా వచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,78,986కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,582 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా మరణాల సంఖ్య 5,30,707కి చేరింది.