భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 306 ప్రకారం.. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పరిగణించబడదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ మహిళ తన కొడుకుతో ప్రేమలో ఉన్న యువతిని ఆత్మహత్య ప్రేరేపించిందన్న ఆరోపణలతో ఆమెపై దాఖలైన ఛార్జిషీట్‌ను తిరస్కరిస్తూ జస్టిస్ బివి నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం వ్యాఖ్యానించింది. నివేదిక ప్రకారం.. ఆత్మహత్యతో మరణించిన యువతి, ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన వ్యక్తికి మధ్య వివాదాల ఆధారంగా.. ఆ వ్యక్తి తల్లిపై ఆరోపణలు వచ్చాయి.
ఛార్జిషీట్ దాఖలు చేసిన మహిళ.. వివాహాన్ని వ్యతిరేకించిందని, విపరీతమైన చర్య తీసుకున్న మహిళపై "అవమానకరమైన" వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఛార్జిషీట్, సాక్షుల స్టేట్‌మెంట్‌లతో సహా రికార్డులో ఉన్న అన్ని సాక్ష్యాలు సరైనవని తీసుకున్నప్పటికీ, అప్పీలుదారుకు వ్యతిరేకంగా చిన్న సాక్ష్యం కూడా లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. వాస్తవానికి ఈ వివాహ విషయంలో బాధితురాలి కుటుంబం సంతృప్తిగా లేదని, ఈ పెళ్లికి అప్పీల్‌దారు అంగీకరించపోయినా.. అది ఐపీసీ 306 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.