ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్.. మరి వారు..!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు.

By Medi Samrat  Published on  5 Dec 2024 8:42 PM IST
ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్.. మరి వారు..!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఫడ్నవీస్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది సీఎంలు హాజరయ్యారు.

నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాయుతి అత్యధికంగా 230 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 132 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది, షిండే శివసేన 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 స్థానాలను గెలుచుకుంది.

Next Story