కండోమ్‌లను ఎగబడి కొంటున్న యువత.. మత్తు కోసమట..!
Demand for flavoured condoms soars in Durgapur as youths get ‘high’ on them.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్
By తోట వంశీ కుమార్ Published on 24 July 2022 8:02 AM GMTపశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో యువత ఎక్కువగా కండోమ్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. యువకులు పెద్ద మొత్తంలో కండోమ్‌లు కొనుగోలు చేయడంతో స్థానికంగా అక్కడ మెడికల్ షాపుల్లో దీని కొరత ఏర్పడుతోంది. అయితే వీటిని శృంగారం కోసం కొనుగోలు చేయడం లేదట. వీటిని ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఆరా తీయగా దిమ్మతిరిగే విషయం తెలిసింది.
దుర్గాపూర్ జిల్లాలోని సిటీ సెంటర్, బెనచిటి, ముచ్చిపర, బిధాన్‌నగర్, సి జోన్ మరియు ఎ జోన్‌లోని మెడికల్ స్టోర్‌లకు ఫ్లేవర్ కండోమ్‌ల జాబితా వచ్చిన వెంటనే క్షణాల్లో అవి ఖాళీ అవుతున్నాయి. ఫ్లేవర్‌తో కూడిన కండోమ్‌లకు అనూహ్యంగా డిమాండ్ పెరగడానికి కారణమేంటని ఓ షాపు యజమాని ఆరా తీస్తే.. కొందరు యువకులు వాటిని అడిక్షన్‌గా వాడుతున్నట్లు తెలిసింది. తన షాపులో రెగ్యులర్ కస్టమర్ అయిన ఓ యువకుడిని ప్రశ్నించగా.. మద్యం మత్తు కోసం నిత్యం కండోమ్‌లు కొంటున్నానని అతడు చెప్పాడు. ఇంతకుముందు తాను రోజూ 3 నుంచి 4 ప్యాకెట్ల కండోమ్‌లను మాత్రమే విక్రయించేవాడినని, అయితే.. ఇప్పుడు దుకాణానికి వచ్చిన క్షణంలో స్టాక్ మొత్తం మాయమైపోతుందని దుకాణదారు చెప్పాడు
కొనుగోలు చేసిన కండోమ్‌లను వేడి నీటిలో రాత్రంతా నానబెడతారు. ఉదయం ఆ కండోమ్‌లను తీసి పక్కన పడేసి ఆ నీటిని తాగి మత్తులో తూగుతున్నారు. ఇదేదో బాగుందని అందరూ నిరోధ్ ప్యాకెట్లు తెచ్చుకుని అదే తీరుగా ప్రయోగాలు చేస్తూ ఒకరిని మించి మరొకరు ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాశంగా మారింది.
ఫ్లేవర్డ్ కండోమ్‌లను వేడి నీటిలో నానబెట్టినప్పుడు ఆ నీళ్లకు ఒక రకమైన ఆల్కహాలిక్ స్వభావం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా కళాశాల విద్యార్థులు ఈ నీటికి బానిసలుగా మారుతున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా కోడ్ లాంగ్వేజీలు ఉపయోగించి మరీ యువకులు పెద్ద ఎత్తున కండోమ్‌లను కొనుగోలు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.