మద్యం ప్రియులకు శుభవార్త.. ఇక ఇంటికే మందు చుక్క
Delhi's new liquor home delivery rules.ఇక మద్యం షాపుల ముందు క్యూ కట్టాల్సిన పని లేదు. ఇప్పటి వరకు పుడ్ డెలివరీ,
By తోట వంశీ కుమార్ Published on 12 Jun 2021 12:47 PM ISTఇక మద్యం షాపుల ముందు క్యూ కట్టాల్సిన పని లేదు. ఇప్పటి వరకు పుడ్ డెలివరీ, నిత్యావసర సరుకుల డోర్ డెలివరీ లాగే ఇక నుంచి ఇంటి వద్దకే మద్యం సరఫరా చేసేలా ఎక్సైజ్ నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం సవరించిన సంగతి తెలిసిందే. కేవలం ఫ్యాక్స్ లేదా ఈ మెయిల్ ద్వారా బుక్ చేసుకుంటేనే డెలివరీ అవుతుందని మొదట్లో ప్రభుత్వం చెప్పింది. అయితే.. మద్యానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా బుకింగ్స్‌కు అనుమతి ఇచ్చింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం మద్యం డెలివరీకి, సరఫరాకి సంబంధించిన కొత్త నియమ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఢిల్లీలో శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
మద్యం విక్రేతలు మద్యాన్ని డోర్ డెలివరీ చేయడానికి నిబంధనల ప్రకారం ఎల్ -13 లైసెన్స్ కలిగి ఉండాలి. కాగా ఎల్-13 లైసెన్స్ కోసం నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మద్యం ఇంటికి ఆర్డర్ చేసుకునే ప్రక్రియ ఇంకా ప్రారంభంకాలేదు. మద్యం విక్రేతలకు ఎల్ -13 లైసెన్స్ జారీ చేసిన తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుంది.
కొత్త నిబంధనలు ఇవే..
- మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా హోం డెలివరీ బుకింగ్స్ చేసుకోవచ్చు
- రెస్టారెంట్లు, పబ్స్‌లో లైవ్ పెర్ఫార్మెన్స్ నిర్వహించుకోవచ్చు. అక్కడే మద్యం తాగేందుకు సైతం అనుమతి
- పబ్స్, రెస్టారెంట్లు, బార్లు కనుక లైసెన్స్ పొందినట్లయితే.. ఓపెన్ స్పేస్, టెర్రస్ ప్రదేశాల్లో మద్యం సేవించవచ్చు.
- టేక్అవే పద్దతిలో మైక్రో బ్రూవరీస్ మద్యాన్ని సరఫరా చేయొచ్చు. అదే విధంగా రెస్టారెంట్లు, పబ్స్ ఈవెంట్లకి మద్యాన్ని అమ్ముకోవచ్చు.