Delhi: వర్షం నీటిలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి
ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలతో నీటి కుంటలు, చెరువులు అన్నీ నిండిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 4:19 PM ISTDelhi: వర్షం నీటిలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి
ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలతో నీటి కుంటలు, చెరువులు అన్నీ నిండిపోతున్నాయి. అయితే.. వర్షాల కారణంగా అక్కడక్కడ ప్రమాదాలూ జరుగుతున్నాయి. వర్షపు నీటితో నిండిన చెరువులో పడి తాజాగా ఇద్దరు చిన్నారు ప్రాణాలు కోల్పోయారు. దాంతో.. కుటుంబంలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. ఆడుకుంటూ వెళ్లి చెరువులో పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు ఏసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శుక్రవారం ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లోని రాణి ఖేరా గ్రామంలో వర్షపు నీటితో నిండిన చెరువులో తొమ్మిదేళ్లు, 15 ఏళ్లు ఉన్న ఇద్దరు బాలికలు ఆడుకుంటూ వెళ్లి చెరువు నీటిలో పడిపోయారు. శుక్రవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం పడింది. ఆ సమయంలోనే ఈ ఇద్దరు చిన్నారులు మరో ఇద్దరితో కలిసి చెరువు వద్దకు ఆడుకుంటూ వెళ్లారు. ఇద్దరు లోతుకు వెళ్లడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెబుతున్నారు. ఇక మిగతా స్నేహితులు ఈ విషయం స్థానికులు , తల్లిదండ్రులకు చెప్పడంతో వారి కోసం గాలించారు. చివరకు చనిపోయిన పిల్లలను బయటకు తీశారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆడుకుంటూ వెళ్లిన చిన్నారులు శవాలుగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.