పుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు దుర్మరణం
దేశరాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla
పుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు దుర్మరణం
దేశరాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పైకి ఉన్నట్లుండి వేగంగా ఒక ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన స్థానికంగా భయాందోళనకు గురి చేసింది.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాస్త్రిపార్క్ దగ్గర సోమవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. సాధారణంగానే ఫుట్‌పాత్‌పై భిక్షాటన చేసే వారు కొందరు నిద్రపోతుంటారు. అయితే.. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డుపక్కన ఫుట్‌పాత్‌పై కొందరు వ్యక్తులు పడుకుని ఉన్నారు. ఒక ట్రక్కు వేగంగా వచ్చి అదుపు తప్పింది. దాంతో.. ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రక్కు కింద పడిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత డ్రైవర్ ట్రక్కును వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అలాగే.. పలువురు ఈ ప్రమాదంలో గాయపడినట్లు తెలిసింది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పారిపోయిన డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
#WATCH | Delhi | This morning, three people died after a truck ran over a footpath in the Shastri Park area where 5 people were sleeping. The driver fled from the spot, leaving the vehicle behind. Further investigation underway: Delhi Police pic.twitter.com/aXqJvpBB3C
— ANI (@ANI) August 26, 2024