ఢిల్లీకి ఉగ్రముప్పు.. పోలీసుల అలర్ట్
Delhi Police on High Alert After Receiving Input on Terror Attack.దసరా, దీపావళి పండుగల సందర్భంగా దేశ రాజధాని
By తోట వంశీ కుమార్ Published on
10 Oct 2021 7:25 AM GMT

దసరా, దీపావళి పండుగల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా నేతృత్వంలో పోలీసు ఉన్నతాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఐబీ హెచ్చరికలపై చర్చించారు. ఉగ్రవాదులు స్థానికుల సహకారం తీసుకునే అవకాశం ఉండంతో.. నగరమంతా పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలన్నారు.
ఢిల్లీలో ఉన్న సైబర్ కేఫ్ లు, రసాయనాలు అమ్మే దుకాణాలు, పార్కింగ్ స్థలాలు, పాతకార్లు అమ్మే డీలర్లు, చెత్త, తుక్కు సామానాలు అమ్మే ప్రదేశాలపై, వ్యక్తులపై ప్రధానంగా దృష్టి సారించాలని కమిషనర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో స్థానిక వాచ్‌మెన్లు, కాలనీ, అపార్ట్‌మెంట్ కమిటీలతో సమావేశం నిర్వహించి అవగాహాన కల్పించాలని సూచించారు. ఇటీవల వివిధ ప్రాంతాల్లో అద్దెకు వచ్చినవారు, ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి పేరుతో ఉన్నవారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు.
Next Story