ఉగ్రకుట్ర భ‌గ్నం.. ఢిల్లీలో పాక్ ఉగ్ర‌వాది అరెస్ట్‌

Delhi Police arrested Pakistani terrorist.ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల నేప‌థ్యంలో ఢిల్లీతో పాటు దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Oct 2021 7:21 AM GMT
ఉగ్రకుట్ర భ‌గ్నం.. ఢిల్లీలో పాక్ ఉగ్ర‌వాది అరెస్ట్‌

ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల నేప‌థ్యంలో ఢిల్లీతో పాటు దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఉగ్ర‌వాదులు దాడుల‌కు తెగ‌బ‌డే అవ‌కాశం ఉంద‌ని ఇంట‌లీజెన్స్ బ్యూరో(ఐబీ) హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఢిల్లీతో పాటు మెట్రో న‌గ‌రాల్లో పోలీసులు అల‌ర్ట్ అయ్యారు. ముష్క‌రుల కోసం అన్ని చోట్ల ముమ్మ‌రంగా గాలింపు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్‌కు చెందిన టెర్ర‌రిస్టును ఢిల్లీ పోలీస్ స్పెష‌ల్ సెల్ మంగ‌ళ‌వారం అదుపులోకి తీసుకుంది. అత‌డిని పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందిన మ‌హ్మ‌ద్ అష్ర‌ఫ్ గా గుర్తించారు.

అత‌డి నుంచి ఏకే-47తోపాటు అద‌నంగా ఉన్న‌ మ్యాగ‌జైన్‌, 60 రౌండ్ల బుల్లెట్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్‌, 2 పిస్ట‌ళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేక్ డాక్యుమెంట్ల‌తో ఢిల్లీలోని లక్ష్మీన‌గ‌ర్‌లోని ర‌మేష్ ఉంటున్నట్లు గుర్తించారు. అత‌డిని అదుపులోకి తీసుకుని అత‌డు ఉంటున్న ఇంటిలో సోదాలు నిర్వ‌హిస్తున్నారు. చ‌ట్ట‌విరుద్ధ కార్య‌క‌లాపాల (నిరోధ‌క‌) చ‌ట్టం, పేలుడు ప‌దార్థాల చ‌ట్టం, ఆయుధాల చ‌ట్టంతోపాటు ఇత‌ర సంబంధిత చ‌ట్టాల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. కాగా.. పోలీసుల అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పింది. పండ‌గ‌ల సీజ‌న్ కావ‌డంతో ఢిల్లీలోని అన్ని మార్కెట్ల‌లో భ‌ద్ర‌త‌ను పెంచారు. మరోవైపు ఉగ్రవాద సంస్థలపై ఎన్‌ఐఏ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ, యూపీ, జమ్ముకశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా 18చోట్ల తనిఖీలు చేస్తోంది.

Next Story