టెస్ట్‌ డ్రైవ్ అని చెప్పి వెళ్లి.. కారుతో జంప్

కారు కొనేముందు చాలా మంది టెస్ట్ డ్రైవ్ చేస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on  26 Sept 2024 5:59 PM IST
టెస్ట్‌ డ్రైవ్ అని చెప్పి వెళ్లి.. కారుతో జంప్

కారు కొనేముందు చాలా మంది టెస్ట్ డ్రైవ్ చేస్తుంటారు. సెకండ్‌ హ్యాండ్ కారు కొనేటప్పుడు ముఖ్యంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని చెక్ చేసిన తర్వాతే కారుకు అడ్వాన్స్ ఇస్తారు. అయితే.. అలా సెకండ్‌ హ్యాండ్ కారు కొనేందుకు వెళ్లిన ఒక వ్యక్తి టెస్ట్ డ్రైవ్ అని చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత కారుతో జంప్ అయ్యాడు. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది.

గ్రేటర్‌ నోయిడాలో సెకెండ్‌ హ్యాండ్‌ కార్ల షోరూమ్‌కు గురువారం ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. తమకు ఎస్‌యూవీ కారు కావాలని అడిగారు. కొనుగోలుదారుడి వివరాలేమీ తెలుసుకోకుండా యజమాని కారును టెస్ట్‌ డ్రైవ్‌కు ఇచ్చాడు. అదే ఓనర్ చేసిన పొరపాటు అయ్యింది. అదే అదునుగా భావించిన ఇద్దరు వ్యక్తులు కారుతో ఉడాయించారు.

దీనిపై సదురు కారు షోరూమ్ ఓనర్ మాట్లాడుతూ.. తమ సిబ్బంది ఒకరిని వెంట తీసుకెళ్లమని చెప్పి.. టెస్ట్‌ డ్రైవ్‌కి ఇచ్చినట్లు చెప్పారు. కొద్ది దూరం వెళ్లాక ఆ ఉద్యోగిని కారు నుంచి కిందకి తోసేసి.. ఆ ఇద్దరు వ్యక్తులు కారుతో ఉడాయించారని అతను పేర్కొన్నాడు. దీని గురించి సమాచారం అందుకున్న వెంటనే పార్క్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇక పోలీసులు కూడా వెంటనే స్పందించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా కారు యజమానులు, కొనుగోలు చేసేందుకు వచ్చిన మధ్య ఏమైనా విభేదాలున్నాయా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.

Next Story