Delhi: వరదలో మునిగిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్, ముగ్గురు మృతి
ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే నగరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ
By Srikanth Gundamalla Published on 28 July 2024 8:27 AM ISTDelhi: వరదలో మునిగిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్, ముగ్గురు మృతి
ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే నగరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ సివిల్స్ శిక్షణా కేంద్రం బేస్‌మెంట్‌లోకి వరద నీరు వచ్చి చేరంది. దాంతో.. ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని రౌస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనం బేస్‌మెంట్ మొత్తం నీటి మునిగింది. నీరు ముంచెత్తిన విషయాన్ని విద్యార్థులు రాత్రి 7.20 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇక వారు వెంటనే అక్కడికి చేరుకుని విద్యార్థులకు సాయం చేశారు. కోచింగ్ సెంటర్‌లో ఉన్నవారందరినీ బయటకు పంపగా.. అప్పటికే ముగ్గురు చనిపోయారని అధికారులు చెప్పారు.
తొలుత ఇద్దరు యువతుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరో యువకుడి డెడ్‌బాడీ లభ్యం అయ్యింది. ఇక మృతదేహాలను పోస్టుమార్టం కోసం అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు వివరాలను ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఎం. హర్షవర్ధన్ వెల్లడించారు. ఇంకా ఐఏఎస్ కోచింగ్ సెంటర్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికీ ఏడు అడుగుల మేర నీరు ఉందని అన్నారు. విద్యార్థులు ఎవరూ కోచింగ్ సెంటర్ వద్దకు రావొద్దని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని ఢిల్లీ ఫైర్ విభాగం చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. బేస్‌మెంట్‌లో ఎవరైనా చిక్కుకున్నారా? అని అనుమానిస్తున్నట్టు తెలిపారు. తాము ఇప్పటి వరకు 30 మంది విద్యార్థులను సేఫ్ గా బయటకు తీసుకొచ్చామని చెప్పారు. మరోవైపు రెండు రోజుల క్రితమే ఇక్కడ సివిల్స్ అభ్యర్ధి ఒకరు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు.