కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ముహూర్తం ఫిక్స్!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.

By Srikanth Gundamalla
Published on : 16 Sept 2024 6:18 PM IST

కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ముహూర్తం ఫిక్స్!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి ఇటీవల బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. అయితే.. ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడానికి ముహూర్తం ఖరారు అయ్యింది. రాబోయే 48 గంటల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన.. లెఫ్టినెంటర్ గవర్నర్ వీకే సక్సేనాను కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన్ని కలిసేందుకు అనుమతించినట్లు ఆప్‌ వెల్లడించింది. ఈ సమయంలోనే తన రాజీనామానున కేజ్రీవాల్‌ సమర్పించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.

ఎన్నికల వరకు ఆప్‌లో ఉన్న నేతల్లో ఒకరు సీఎం పదవి చేపట్టేందుకు ముమ్మరం చర్చలు జరుగుతున్నాయి. పార్టీ సమావేశంలో కేజ్రీవాల్‌ కూడా నేతల్లో ఒకరిని సీఎం చేస్తానని చెప్పారు. కేజ్రీవాల్‌ను ఆప్‌ సీనియర్‌ నేతలు మనీష్ సిసోడియా, రాఘవ్ చద్దా ఈరోజు ఉదయం కలుసున్నారు. మరోవైపు, కేజ్రీవాల్ జైలులో ఉన్న సమయంలో పార్టీ కీలక బాధ్యతలు నిర్వహించిన అతిషి ముఖ్యమంత్రి రేసులో ముందున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో సునీత కేజ్రీవాల్, గోపాల్ రాయ్‌ పేర్లు కూడా సీఎం పదవి రేసులో ఉంటారని వినిపిస్తున్నాయి. జైలు నుంచి విడుదైలన కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ప్రజాకోర్టులోనూ న్యాయం జరిగిన తర్వాతే తిరిగి సీఎం సీట్లో కూర్చుంటానని చెప్పారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరపాలని కోరారు కేజ్రీవాల్.

Next Story