మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ విజ్ఞప్తి

మధ్యంతర బెయిల్‌ కాలం దగ్గరపడుతుండటంతో ఆయన సుప్రీంకోర్టున ఆశ్రయించారు.

By Srikanth Gundamalla  Published on  27 May 2024 11:27 AM IST
delhi, cm kejriwal, petition, supreme court, bail,

మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ విజ్ఞప్తి

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు కేజ్రీవాల్. మధ్యంతర బెయిల్‌ కాలం దగ్గరపడుతుండటంతో ఆయన సుప్రీంకోర్టున ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలంటూ సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు వారం రోజుల పాటు బెయిల్‌ పొడిగించాలని సుప్రీంకోర్టు సీఎం కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాననీ.. అందుకే కొన్ని కీలక వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని కేజ్రీవాల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని సుప్రీంకోర్టును ఆప్‌ జాతీయ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్ కోరారు.

జైలులో ఉన్న సమయంలో ఏడు కిలోల బరువు తగ్గడం, కీటోన్స్‌ పెరగడం వంటి అనారోగ్య సమస్యలకు సరైన చికిత్స తీసుకోవాల్సి ఉందని కేజ్రీవాల్ కోర్టుకు చెప్పారు. ఇందుకోసం పెట్‌ స్కాన్‌ వంటి కీలక టెస్టులు చేయించుకోవాలని వైద్యులు చెప్పారని అన్నారు. ఈ క్రమంలోనే తన బెయిల్‌ గడువుని 7 రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును కోరారు. లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలో ఢిల్లీ సీఎం, ఆప్‌ చీఫ్‌ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.

ఇక లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓ పార్టీ అధ్యక్షుడిగా ప్రచారం నిర్వహించుకునేందుకు సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంత బెయిల్‌ను ఇచ్చింది. జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. తిరిగి జూన్ 2వ తేదీన జైలుకు వెళ్లాలని చెప్పింది. అయితే.. బెయిల్‌ మంజూరు విసయంలో కేజ్రీవాల్‌ను స్పెషల్‌గా ట్రీట్ చేసిందంటూ బీజేపీ వర్గాలు సుప్రీంకోర్టు తీర్పును ఆక్షేపించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ఈ విషయంపై స్పందించి పరోక్ష విమర్శలు చేశారు. రాజకీయపరంగా విమర్శలు వెల్లివెత్తుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఉత్కంఠ రేపుతోంది.

Next Story