ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు క‌రోనా

Delhi CM Arvind Kejriwal tests Covid-19 positive.ఆమ్ఆద్మీ పార్టీ అధ్య‌క్షుడు, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jan 2022 9:36 AM IST
ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు క‌రోనా

ఆమ్ఆద్మీ పార్టీ అధ్య‌క్షుడు, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా త‌న‌కు పాజిటివ్‌గా వ‌చ్చినట్లు తెలిపారు. అయితే.. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్న‌ట్లు చెప్పారు. క‌రోనా పాజిటివ్‌గా రావ‌డంతో హోం ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన‌ట్లు పేర్కొన్నారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. ఇక ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు ప్రార్థిస్తున్నారు. కేజ్రీవాల్ క‌రోనా బారిన ప‌డ‌డంతో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారానికి కొంతకాలం పాటు బ్రేక్ ప‌డిన‌ట్లే.

ఇక ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. అక్క‌డ పాజిటివ్ రేటు 6కి పైగా న‌మోదు అయ్యింది. ఇక సోమ‌వారం రికార్డు స్థాయిలో 4,099 కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టికే అక్క‌డ రాత్రి క‌ర్ఫ్యూని విధించారు. అయిన‌ప్ప‌టికీ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో వీకెంట్ లాక్‌డౌన్‌ను విధించే అవ‌కాశం ఉంది. ఇక అక్క‌డ కొత్త‌గా న‌మోదు అవుతున్న కేసుల్లో 84 శాతానికి పైగా ఒమిక్రాన్ కేసులు ఉన్న‌ట్లుగా ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి తెలిపారు. అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. క‌రోనా నిబంధ‌న‌లు ఖ‌చ్చితంగా పాటించాల‌ని ఆయ‌న‌ సూచించారు.

Next Story