త‌న‌ శరీరం జైలులో ఉన్నా.. ఆత్మ మీ మధ్యే ఉంది : సునీతా కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మీ గురించి ఆందోళన చెందుతున్నారు.

By Medi Samrat  Published on  27 March 2024 2:38 PM IST
త‌న‌ శరీరం జైలులో ఉన్నా.. ఆత్మ మీ మధ్యే ఉంది : సునీతా కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మీ గురించి ఆందోళన చెందుతున్నారు. మద్యం కుంభకోణంపై మార్చి 28న కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ వివ‌రాలు వెల్లడిస్తానని చెప్పారని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశారు.

మద్యం కుంభకోణం అనే ఈ షోలో రెండేళ్లలో చాలా చోట్ల దాడులు చేశార‌ని.. కానీ ఒక్క పైసా కూడా దొర‌క‌లేద‌ని అరవింద్ జీ నాకు చెప్పారు. సిసోడియా, సంజయ్, మా ఇళ్ల‌లో సోదాలు చేశారు.. కానీ ఎవ‌రి వద్ద ఒక్క పైసా కూడా దొర‌క‌లేదు. త‌న‌ శరీరం జైలులో ఉంది కానీ ఆయ‌న‌ ఆత్మ మీ మధ్యే ఉందని పేర్కొన్నారు.

నిన్న సాయంత్రం నేను అరవింద్ జీని జైల్లో కలిశాను. నీరు, మురుగునీటి పారుదల సమస్యలను పరిష్కరించాలని రెండు రోజుల క్రితం ఢిల్లీ జలమండలి మంత్రి అతిషికి సందేశం పంపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం.. ముఖ్యమంత్రిపై కేసు పెట్టిందని.. ఢిల్లీని నాశనం చేయాలనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు.

ఈ మద్యం కుంభకోణం దర్యాప్తులో గత రెండేళ్లలో ఈడీ 250కి పైగా దాడులు నిర్వహించిందని అరవింద్ జీ నాతో చెప్పారని అన్నారు. ఇప్పటి వరకు రైడ్‌లో ఎలాంటి డబ్బులు లభించలేదని.. దీనిపై మార్చి 28న కోర్టులో రుజువుల‌తో వెల్లడిస్తానని తెలిపారని పేర్కొన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ఆయనను కలవడానికి మంగళవారం ED కార్యాలయానికి వెళ్లారు. అంతకు ముందు ఆదివారం కూడా కలిశారు. కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీలో ఉన్నప్పటి నుంచి ఆమె రోజూ సాయంత్రం ఆయన్ను కలిసేందుకు వెళుతోంది. నిన్న సాయంత్రం కూడా సునీతా కేజ్రీవాల్ ఆయనను కలిశారు.

Next Story