'ఆ సీన్లు తొల‌గించండి.. లేదంటే ప‌ఠాన్ మూవీని బ్యాన్ చేస్తాం'

Deepika's outfit objectionable, will take a call on 'Pathaan' film ban, says MP Home Minister. షారుక్ ఖాన్‌, దీపికా ప‌దుకోణె హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన లేటెస్ట్‌ సినిమా 'ప‌ఠాన్'.

By అంజి  Published on  14 Dec 2022 5:07 PM IST
ఆ సీన్లు తొల‌గించండి.. లేదంటే ప‌ఠాన్ మూవీని బ్యాన్ చేస్తాం

షారుక్ ఖాన్‌, దీపికా ప‌దుకోణె హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన లేటెస్ట్‌ సినిమా 'ప‌ఠాన్'. ఈ సినిమాపై మెల్లగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజైన బేష‌రమ్ రంగ్ వీడియో సాంగ్‌ వివాదానికి దారితీసింది. ఈ పాట‌లో దీపికా ధ‌రించిన కాస్ట్యూమ్స్‌పై అభ్యంత‌రంతో పాటు అశ్లీలం ఎక్కువగా ఉందని, 'ప‌ఠాన్' సినిమాని బాయ్‌కాట్‌ చేయాలని సోష‌ల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై నిషేధం విధించాల‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోం మంత్రి న‌రోత్తం మిశ్రా కోరారు.

ఈ సినిమాలో కాషాయ దుస్తుల‌ను వాడటం ప‌ట్ల ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. సినిమాలో కొన్ని అభ్యంత‌ర‌క‌ర సీన్లు ఉన్నాయ‌ని, ఈ సీన్ల‌ను మార్చాలని లేని పక్షంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పఠాన్ మూవీ విడుదలపై ఆలోచించాల్సి వస్తుందన్నారు. సినిమాలో అభ్యంత‌ర‌కరంగా ఉన్న కాస్ట్యూమ్స్‌ను, వివాదాస్ప‌ద సీన్ల‌ను మార్చ‌ని ప‌క్షంలో రాష్ట్రంలో ప‌ఠాన్ విడుదలను అడ్డుకుంటామ‌ని స్పష్టం చేశారు. బేష‌ర‌మ్ పాట‌లో కాస్ట్యూమ్స్ తీవ్ర అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని, ఈ సాంగ్‌ను చ‌వ‌క‌బారు మైండ్‌సెట్‌తో చిత్రీక‌రించార‌ని మిశ్రా ట్వీట్ చేశారు.

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న పఠాన్ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సీనియర్ నాయకుడు మిశ్రా అక్టోబర్‌లో రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ చిత్రం "ఆదిపురుష్"ను నిర్మించిన ప్రొడ్యూసర్లను హెచ్చరించాడు. హిందూ మతపరమైన వ్యక్తులను "తప్పు" మార్గంలో చూపించే దృశ్యాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.'' అని అన్నారు.


Next Story