వేలానికి దావూద్‌ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు

దావూద్ ఇబ్రహీంకు చెందిన చిన్ననాటి ఇల్లును కూడా వేలానికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  2 Jan 2024 8:45 AM GMT
dawood ibrahim, properties,  auction,  mumbai,

వేలానికి దావూద్‌ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు 

ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత మోస్ట్‌ వాంటెడ్ అండర్ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం గురించి అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా దావూద్‌ ఇబ్రహీంకు సంబంధించిన ఆస్తులను అధికారులు వేలం వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దావూద్ ఇబ్రహీంకు చెందిన చిన్ననాటి ఇల్లును కూడా వేలానికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర రత్నగిరిలోని దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లుతో పాటు మరికొన్ని ప్రాపర్టీలు ఉన్నాయి. వాటినే అధికారులు వేలం వస్తున్నారు.

దావూద్‌ ఇబ్రహీం కుటుంబ సభ్యులకు సంబంధించిన నాలుగు ప్రాపర్టీలు, వ్యవసాయ భూమి ముంబాకే గ్రామంలో ఉన్నాయి. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్‌ఛేంజ్‌ మానిప్యులేటర్ చట్టం, 1976 కింద దావూద్‌ ఇబ్రహీం ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వాటిలో కొన్నింటిని జనవరి 5న అధికారులు వేలం వయనున్నారు. ముంబైలో శుక్రవారం ఈ వేలం జరగనున్నట్లు తెలుస్తోంది.

గడిచిన 9 ఏళ్లలో దావూద్, అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన 11 ఆస్తులను అధికారులు వేలం వేశారు. వాటిలలో రూ.4.53 కోట్ల విలువైన ఒక రెస్టారెంట్, రూ.3.53 కోట్ల విలువైన ఆరు ఫ్లాట్లు, రూ.3.52 కోట్ల విలువైన గెస్ట్‌ హౌజ్ అమ్ముడుపోయాయి. 1983లో ముంబైకి రాకముందు దావూద్ ఇబ్రహీం ముంబాకే గ్రామంలో ఉండేవాడు. అయితే.. ముంబైలో పేలుళ్లు జరిపిన తర్వాత దావూద్ ఇబ్రహీం ఇండియాను విడిచివెళ్లిపోయిన విషయం తెలిసిందే. ముంబై పేలుళ్ల సంఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. దావూద్‌ ఇబ్రహీం ఆరోగ్యానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దావూద్‌ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా ఉందనీ.. అతనిపై విషప్రయోగం జరిగి ఆస్పత్రిలో చనిపోయారనీ కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఇవన్నీ ఫేక్‌ వార్తలేనని తర్వాత నిఘా వర్గాలు వెల్లడించాయి.

Next Story