ఓటు వేయలేదని.. మహాదళిత్ వర్గానికి చెందిన ఇద్దరు యువకులను

Dalits forced to do sit-ups and lick the spit.బీహార్‌లోని ఔరంగాబాద్‌లో, పంచాయతీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఓటు

By M.S.R  Published on  13 Dec 2021 1:47 PM IST
ఓటు వేయలేదని.. మహాదళిత్ వర్గానికి చెందిన ఇద్దరు యువకులను

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో, పంచాయతీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఓటు వేయనందుకు కొంతమందిపై ఒక అభ్యర్థి నీచ సంస్కృతికి తెరతీశాడు.మహాదళిత్ వర్గానికి చెందిన ఇద్దరు యువకులతో బలవంతంగా బస్కీలు(సిట్‌అప్‌లు) తీయించారు. అక్కడితో ఆగని నిందితులు బాధితులపై ఉమ్మివేస్తూ, మిగిలిన వారితో కూడా ఉమ్మివేయమని బలవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసు ఔరంగాబాద్ జిల్లాలోని అంబా పోలీస్ స్టేషన్ పరిధిలోని డుమ్రీ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీ ఎన్నికల్లో చీఫ్‌ పదవికి ఓటు వేయనందుకు మహాదళిత వర్గానికి చెందిన వారిపై నిందితుడు దాడికి పాల్పడ్డారు. యువకులైన అనిల్ కుమార్ భుయాన్, మంజిత్ భుయాన్‌లను హింసించారు. పంచాయతీ నుండి ప్రధాన అభ్యర్థిగా బరిలోకి దిగిన బల్వంత్ కుమార్, యువకులను బలవంతంగా కూర్చోబెట్టి ఉమ్మివేయడం వీడియోలో కనిపిస్తోంది. అతను సిట్-అప్‌ల సమయంలో వారిని తన్నడం కూడా కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓటు వేయనందుకు ఇలా చేశారని ఆరోపించారు. ప్రస్తుతం బల్వంత్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

ఈ కేసులో నిందితుడైన బల్వంత్ కుమార్ అదే పంచాయతీలోని సింగ్నా గ్రామానికి చెందినవాడు. మంజిత్‌ భూయాన్‌ వాంగ్మూలంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు అంబా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ తెలిపారు. తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన అభ్యర్థి ఆరోపణలను ఖండించారు. ఇద్దరు యువకులు మద్యానికి బానిసలయ్యారని.. తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు.

Next Story