నెటిజన్ల విమర్శలు.. క్షమాపణలు చెప్పిన దలైలామా

దలైలామా ఓ బాలుడి పెదాలపై ముద్దుపెట్టడం తీవ్ర వివాదస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో

By M.S.R
Published on : 10 April 2023 4:45 PM IST

Dalai Lama, National news, spiritual leader

నెటిజన్ల విమర్శలు.. క్షమాపణలు చెప్పిన దలైలామా 

దలైలామా ఓ బాలుడి పెదాలపై ముద్దుపెట్టడం తీవ్ర వివాదస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దలైలామా స్పందించారు.ఆ బాలుడికి, అతని కుటుంబసభ్యులకు క్షమాపణలు తెలియజేశారు.

‘మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఉంది.. అని ఓ బాలుడు దలైలామాను కోరారు. ఆ సమయంలో వారి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించే ఉంటే, అందుకు ఆ బాలుడికి, అతడి కుటుంబానికి దలైలామా క్షమాపణలు తెలియజేస్తున్నారు. తనను కలిసే వ్యక్తులు, ముఖ్యంగా చిన్నారులతో దలైలామా సరదాగా ఉంటారు. కొన్నిసార్లు వారిని ఆటపట్టిస్తుంటారు. తాజాగా చోటు చేసుకున్న ఘటనకు విచారం వ్యక్తం చేస్తున్నారు’ అని దలైలామా బృందం వెల్లడించింది.

దలైలామా ఇటీవల ఒక బాలుడి పెదవులపై ముద్దు పెట్టారు. ఆ తర్వాత తన నాలుకను బయటకు చాపారు. దానిని చప్పరిస్తావా అని ఆ బాలుడితో అన్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో పలువురు నెటిజన్లు ఆయన చర్యను తప్పుబడుతూ ఉన్నారు.

Next Story