ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైందని సమాచారం. త్వరలోనే డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) అలవెన్సులు రెండోసారి పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం ప్రకారం సెప్టెంబర్‌లో పెంపు ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. డీఏ 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉండటంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరకుంటుంది.
ఇక కొవిడ్ సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ, డీఆర్ అలవెన్సులను ప్రభుత్వం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదని సమాచారం. కాగా సోమవారం, 19 ఆగస్టు 2024 నాటి నివేదికలు, సెప్టెంబర్‌లో డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)లో 3 శాతం పెంపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చని సూచిస్తున్నాయి. ఈ ఊహించిన పెంపు మొత్తం డీఏను 53 శాతానికి తీసుకువస్తుంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ఇద్దరు సభ్యులు డీఏ బకాయిలపై ప్రభుత్వ నిర్ణయం గురించి ప్రశ్నలను లేవనెత్తారు: ''18 నెలల కోవిడ్ కాలంలో డియర్‌నెస్ అలవెన్స్‌ను విడుదల చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందా?'' అని అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, "లేదు" అని బదులిచ్చారు. జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చేలా సెప్టెంబర్ 2024లో డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) , డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) లలో 3 శాతం పెంపుదలని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.