దక్షణ తీర రాష్ట్రాలకు తుఫాన్ ప్రమాదం పొంచి ఉంది. యాస్ తుఫాన్ క్రమంగా బలపడుతుండటంతో రైల్వేశాఖ అప్రమత్తం అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా 59 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే శనివారం రాత్రి వెల్లడించింది. యాస్ తుఫాన్ ఈ నెల 26 వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు తూర్పు మధ్య బంగాళాఖాతం దాని వెంటే ఉత్తర అండమాన్ తీరంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో దక్షిణ తీర రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
రద్దైన రైళ్ల వివరాలు ఇవే..
- హౌరా- హైదరాబాద్(08645), హైదరాబాద్-హౌరా(08646), హౌరా-సికింద్రాబాద్(02703) రైళ్లు ఈ నెల 25 నుంచి 27 వరకు నిలిచిపోనున్నాయి.
- సికింద్రాబాద్-హౌరా(02704) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను 24 నుంచి 26 వరకు రద్దు చేశారు
- భువనేశ్వర్-సికింద్రాబాద్(07015) 26 నుంచి 28 వరకు
- సికింద్రాబాద్ - భువనేశ్వర్(07016) 24 నుంచి 26 వరకు
- తిరుపతి- పూరి (07479) ఎక్స్‌ప్రెస్ 24 నుంచి 26 మధ్య
- తిరుపతి -పూరి(07480) 26 నుంచి 28 వరకు
- గౌహతి-సికింద్రాబాద్(07029), సికింద్రామాద్-షాలిమార్(02774) 25న, షాలిమార్-సికింద్రాబాద్(02773) 26న రద్దు అయ్యాయి.
మిగిలిన వాటిలో ఎక్కువ రైళ్లు ఈ నెల 26న ఒక రోజు , మరికొన్ని 27, 28, 29 తేదీల్లో రద్దు అయ్యాయి.