మోచా తుఫాను ముప్పు.. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాల మోహరింపు

మోచా తుఫాను ముప్పు దృష్ట్యా పశ్చిమ బెంగాల్‌లో ఆరు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. ఈ బృందాలను రాంనగర్

By అంజి  Published on  11 May 2023 2:30 PM IST
Cyclone, Mocha, Bay of Bengal,  Myanmar, NDRF

మోచా తుఫాను ముప్పు.. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాల మోహరింపు

మోచా తుఫాను ముప్పు దృష్ట్యా పశ్చిమ బెంగాల్‌లో ఆరు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. ఈ బృందాలను రాంనగర్ 1 బ్లాక్, రాంనగర్ 2, తూర్పు మిడ్నాపూర్‌లోని హల్దియా వద్ద, దక్షిణ 24 పరగణాల్లోని గోసాబా కుల్తాలి, కక్‌ద్వీప్‌, ఉత్తర 24 పరగణాల్లోని హింగల్‌గంజ్, సందేశ్‌ఖాలీలో మోహరించారు. కోస్ట్ గార్డ్ బృందం కూడా హై అలర్ట్‌లో ఉంది. కోస్ట్ గార్డ్ అధికారులు డిజాస్టర్ రిలీఫ్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఒడిశా- బెంగాల్ తీర ప్రాంతాలలో అలర్ట్ గా ఉన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోచా తుఫానుగా మారుతుందని, మే 12 మధ్యాహ్నం నాటికి చాలా తీవ్రమైన తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మే 14 న ఉదయం తుఫాను ల్యాండ్‌ఫాల్ అవుతుందని.. బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్, మయన్మార్‌లోని కుక్ప్యు వద్దకు చేరుకోనుంది. భూభాగాన్ని తాకే సమయంలో మోచా కారణంగా గరిష్టంగా 130 కి.మీ. గాలులు వీస్తాయి. ఇది బెంగాల్‌పై ఎంత ప్రభావం చూపుతుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరింది.

Next Story