మోస్ట్ పవర్ ఫుల్ లీడర్లనే చంపేస్తామంటూ బెదిరింపులు..!

CRPF receive E-mail threatening.బీజేపీ నేతలను చంపేస్తామంటూ వచ్చిన ఈ మెయిల్‌ బెదిరింపు కలకలం రేపుతోంది. ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌, అమిత్ షాల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2021 7:09 PM IST
yogi, Amitsha

భారతదేశం లోని మోస్ట్ పవర్ ఫుల్ లీడర్లలో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు ఉంటారు. వీరి చుట్టూ ఎప్పుడూ రక్షణ వలయం ఉంటుంది. అలాంటి ఈ బడా నేతలను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కీలక బీజేపీ నేతలను చంపేస్తామంటూ వచ్చిన ఈ మెయిల్‌ బెదిరింపు కలకలం రేపుతోంది. ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌, అమిత్ షాల‌ను పదవులనుంచి తొలగించండి.. లేదా చంపేస్తాం.. అంటూ ముంబై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఆఫీస్‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం ఒక ఈమెయిల్‌ వచ్చింది. ఆత్మాహుతి దాడుల ద్వారా ఆ ఇద్ద‌రినీ చంపేస్తామంటూ మెయిల్‌ ద్వారా హెచ్చ‌రించారు.

11 మంది సూసైడ్‌ బాంబర్లు సిద్ధంగా ఉన్నారని వారి ద్వారా యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను అంతం చేస్తామని తెలిపారు. అంతేకాదు ప్రార్థ‌నా మందిరాలు, ఇత‌ర ముఖ్య‌మైన ప్ర‌దేశాల్లోనూ దాడులు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఈ-మెయిల్‌ ఎక్కడ నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీసే పనిలో పడ్డాయి భద్రతా దళాలు.


Next Story