జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో మంగళవారం (జనవరి 27, 2026)నాడు ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు ఆగి ఉన్న రోడ్డు క్యారియర్‌ను, మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఒక CRPF జవాన్‌తో సహా నలుగురు మరణించారని అధికారులు తెలిపారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై జఖాని-చెనాని ప్రాంతం సమీపంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
దోడా నుండి జమ్మూకు వెళ్తున్న బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత లోడ్ క్యారియర్‌ను ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో లోడ్ క్యారియర్ టెక్నికల్ ఇష్యూ వల్ల రోడ్డు పక్కన ఆగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో మెకానిక్, లోడ్ క్యారియర్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అత్యవసర కిటికీలోంచి బయటకు విసిరివేయబడి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని అధికారి తెలిపారు.