సాధారణ జలుబుగా మారనున్న కొవిడ్ - 19... అయితే దీనికి..!
Covid 19 will become like common cold.కొవిడ్ - 19 సాధారణ జలుబులా మారుతుందని, అయితే దీనికి కొంత సమయం
By అంజి Published on 9 Oct 2021 3:44 AM GMTకొవిడ్ - 19 సాధారణ జలుబులా మారుతుందని, అయితే దీనికి కొంత సమయం పడుతుందని ఇంగ్లాండ్ జాతీయ ఆరోగ్య సేవ వ్యవస్థాపకుడు మాల్కం గ్రాంట్ అన్నారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2021లో ప్రసంగిస్తూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హెల్త్‌కేర్ విభాగంలో ఇప్పటికే ఎన్నో సాధిస్తుండగా వాటిలో గణనీయమైన మార్పును తీసుకురావడానికి భారత్‌కు ఇది అవకాశమని మాల్కం గ్రాంట్ పేర్కొన్నారు. భారత్‌లో సామాజిక పరిస్థితులు రాష్ట్రాల వారీగా విభిన్నంగా ఉన్నందున ఇక్కడ సమ్యలు చాలా ఎదురవుతాయని అన్నారు. ఆరోగ్య సంరక్షణ చేపట్టేందుకు ఎప్పుడూ ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదని..ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావాలన్నారు.
రానున్న రోజుల్లో కొవిడ్ - 19 సాధారణ జలుబులాగా మారుతుందని గ్రాంట్ యూనివర్సిటీ ఆఫ్ యార్క్ ఛాన్సలర్ మల్కాం గ్రాంట్ అన్నారు. కరోనా వైరస్ ఇంకా పూర్తిగా అర్థం కాలేదని.. తెల్సుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని, అందుకు సమయం పడుతుందని అన్నారు. ఇప్పటికి కరోనా వైరస్ విజృంభిస్తునే ఉందని, అమెరికాలో ప్రతి వారం 53,000 మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. యూరప్‌లో మరణాల రేటు తగ్గిన కేసుల సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నారు. రానున్న శీతకాలంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడం పెద్ద సవాల్ అని, ఇక్కడి ప్రజలు కరోనా వైరస్‌పై అవగాహనతో ఉండాలన్నారు. డిజిటల్ వేదికగా శిక్షణ ఇవ్వాలని.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా కొవిడ్‌పై అవగాహన కల్పించాలని మాల్కం గ్రాంట్ సూచించారు.