కొవాగ్జిన్ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్.. క‌రోనా, డెల్టా వేరియంట్‌ను ఎంత వ‌ర‌కు అడ్డుకోగ‌ల‌దంటే..?

Covaxin has overall vaccine efficacy of 77.8%.మ‌న‌దేశంలో కోవిషీల్డ్ త‌రువాత కోవాగ్జిన్ టీకానే ఎక్కువ‌గా అందుబాటులో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2021 3:24 AM GMT
కొవాగ్జిన్ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్.. క‌రోనా, డెల్టా వేరియంట్‌ను ఎంత వ‌ర‌కు  అడ్డుకోగ‌ల‌దంటే..?

మ‌న‌దేశంలో కోవిషీల్డ్ త‌రువాత కోవాగ్జిన్ టీకానే ఎక్కువ‌గా అందుబాటులో ఉంది. అయితే.. ఈ టీకా తీసుకుంటే.. క‌నీసం జ్వరం కూడా రావ‌టం లేద‌ని అంటున్నారు. ఈ టీకా పై ప‌లువురిలో సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీంతో చాలా మంది ఈ టీకా తీసుకునేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూపడం లేద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా కొవాగ్జిన్ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్ ను విడుద‌ల చేసింది. క‌రోనాపై కొవాగ్జిన్ టీకా 77.8శాతం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు భార‌త బ‌యోటెక్ శ‌నివారం ప్ర‌క‌టించింది.

కొవిడ్ లక్ష‌ణాలు తీవ్రంగా ఉన్న వారిలో కొవాగ్జిన్ టీకా 93.4శాతం స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపింది. ఇక ప్ర‌స్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న B.1.617.2 (డెల్టా), B.1.351 (బీటా) వేరియంట్‌లకు వ్యతిరేకంగా 65.2 శాతం సమర్థతను ప్రదర్శించిందని కంపెనీ వెల్ల‌డించింది. తీవ్ర ల‌క్ష‌ణాలు నిలువ‌రించి ఆస్ప‌త్రిలో చేరే అవ‌స‌రాన్ని కొవాగ్జిన్ త‌గ్గిస్తోంద‌ని వివ‌రించారు.

నవంబర్ 16, 2020లో జరిగిన మూడో దశ ట్రయల్స్‌లో 25,798 మంది పాల్గొన్నారు. మొదటి డోస్ తీసుకున్నారు. అలాగే.. జనవరి 7, 2021న 24,419 మంది రెండో డోసు తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. మొత్తం 146 రోజులపాటూ వ్యాక్సిన్ వేసుకున్న వారిని పరిశీలించారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి చేయడం ద్వారా.. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చెయ్యగలవు అని నిరూపించినట్లయిందని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.

Next Story
Share it