దేశంలో ఆ 8 రాష్ట్రాల్లోనే అధికంగా కరోనా మరణాలు
Corona deaths are highest in 8 states I దేశంలో ఆ 8 రాష్ట్రాల్లోనే అధికంగా కరోనా మరణాలు
By సుభాష్ Published on 30 Nov 2020 4:01 PM IST
దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక దేశంలో కోవిడ్ మరణాల్లో అధిక శాతం 8 రాష్ట్రాల నుంచే ఉంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఆదివారం కొత్త గా 443 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,7,173కు చేరింది.వీటిలో 71 శాతం మరణాలు ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, హర్యానా, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచే ఎక్కువగా కరోనా మరణాలు సంభవిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఆదివారం సంభవించిన 443 మరణాల్లో 89 ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 68, పశ్చిమబెంగాల్‌లో 54 మరణాలు నమోదయ్యాయి. ఇక 22 రాష్ట్రాల్లో మరణాల రేటు జాతీయ సగటు మరణాల రేటు కంటే తక్కువగా ఉండటం కాస్తా ఊరటనిస్తోంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తగా కరోనా మరణాల రేటు 1.45శాతం ఉంది. ఆగస్టులో 1.98 శాతంగా ఉన్న మరణాల రేటు గత మూడు నెలలుగా క్రమంగా తగ్గుతూ1.45 శాతానికి చేరింది.
దేశ వ్యాప్తంగా ఏఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు, ఎన్ని మరణాలు
1. మహారాష్ట్రలో 18,20,059 పాజిటివ్ కేసులుండగా, 47,071 మరణాలు ఉన్నాయి.
2. ఢిల్లీలో 5,66,648 పాజిటివ్ కేసులుండగా, 9,066 మరణాలున్నాయి.
3. పశ్చిమబెంగాల్‌లో 4,80,813 పాజిటివ్ కేసులుండగా, 8,376 మరణాలున్నాయి.
4. హర్యానాలో 2,32,522 పాజిటివ్ కేసులుండగా, 2,401 మరణాలున్నాయి.
5. పంజాబ్‌లో 1,51,538 పాజిటివ్ కేసులుండగా, 4,780 మరణాలున్నాయి.
6. కేరళలో 5,99,600 పాజిటివ్ కేసులుండగా, 2,223 మరణాలున్నాయి.
7. ఉత్తరప్రదేశ్‌లో 5,41,879 పాజిటివ్ కేసులుండగా, 7,742 మరణాలున్నాయి.
8. రాజస్థాన్‌లో 2,65,386 పాజిటివ్ కేసులుండగా, 2,292 మరణాలున్నాయి.
ఇలా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మరణాల సంఖ్య గానీ, పాజిటివ్ కేసుల సంఖ్య గానీ ఎక్కువగా ఉంటోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో పాజిటివ్ కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్నా.. ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సిన్ లేని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప ఎలాంటి మార్గం లేదు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ , తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఇప్పటికే ప్రభుత్వాలు, అధికారులు,వైద్యులు సూచించారు. కరోనా నుంచి రక్షించుకోవాలంటే భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.