బయోలాజికల్ ఇ.. రూ.500కే రెండు డోసుల టీకా.. !
Corbevax may be India's cheapest vaccine at Rs 250.బయోలాజికల్ ఇ లిమిటెడ్(బీఇ) అభివృద్ది చేస్తున్న కొవిడ్ టీకా
By తోట వంశీ కుమార్ Published on 5 Jun 2021 5:55 AM GMTబయోలాజికల్ ఇ లిమిటెడ్(బీఇ) అభివృద్ది చేస్తున్న కొవిడ్ టీకా ట్రయల్స్ దశలో ఉంది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. కార్బివాక్స్ టీకాలను అత్యంత తక్కువ ధరకు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఓ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. రెండు డోసులు కలిపితే ఆ టీకాల ఖరీదు రూ.500 ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అంటే ఒక్కో డోసు ధర కేవలం రూ.250 మాత్రమే. ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చునని సదరు మీడియా కథనం పేర్కొంది.
ఒకవేళ ఆ టీకాకు అత్యవసరం ఆమోదం దక్కితే ఇక ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. అన్నీ అనుకూలిస్తే ఆ టీకాకు చెందిన రెండు డోసుల ధర రూ.400 లోపే ఉంటుందని కూడా పేర్కొంది. ప్రభుత్వాలకు,ప్రైవేటుకు ఇదే ధరకు విక్రయిస్తే.. దేశంలోనే అత్యంత చవకైన వ్యాక్సిన్ ఇదే కానుంది. కార్బివాక్స్ టీకాకు ఇంకా అధికారికంగా టీకా ధరను ప్రకటించలేదు. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ సంస్థతో కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది.
ఒప్పందం ప్రకారం బీఇ సంస్థ 30 కోట్ల టీకాలు ఉత్పత్తి చేయనున్నది. ఇందుకోసం కేంద్రం కంపెనీకి అడ్వాన్స్‌గా రూ.1500 కోట్లను ఇవ్వనుంది. ఆర్‌బీడీ ప్రోటీన్ సబ్ యూనిట్ రీతిలో వ్యాక్సిన్‌ను డెవలప్ చేస్తున్నారు. బేలర్ కాలేజీ ఆఫ్ మెడిసన్‌తో ఈ టీకాలను బీఈ డెవలప్ చేయనున్నది. దీనితో పాటు కెనడాకు చెందిన ప్రావిడెన్స్ థెరపాటిక్స్ హోల్డింగ్స్‌తోనూ బీఈ ఒప్పందం కుదుర్చుకున్నది. కెనడా కంపెనీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నది. ప్రావిడెన్స్‌తో కలిపి వచ్చే ఏడాది నాటికి వంద కోట్ల టీకాలను బీఈ ఉత్పత్తి చేయనున్నది.