కదులుతున్న రైలు ఎక్కడం, గానీ దిగడం గానీ చేయవద్దని ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ కొందరు ప్రయాణీకులు మాత్రం తమకు ఇవేం పట్టవు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటననే ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది.
పలాస-కటక్ ఎక్స్‌ప్రెస్ రైలు భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌ను సమీపించింది. రైలు ఇంకా స్టేషన్‌లో ఆగకముందే ఓ మహిళ రైలులోంచి దిగేందుకు యత్నించింది. ఈ క్రమంలో ఆ మహిళ పట్టు తప్పి జారిపోయింది. రైలుకు, ఫ్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో పడిపోతుండగా.. గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ఎస్ ముండా ఆమెను రక్షించాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
సమయస్పూర్తితో వ్యవహరించి.. మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.