Video: లైవ్ ప్రెస్ మీట్‌లో.. కాంగ్రెస్ నాయకుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి

కోలార్ జిల్లాకు చెందిన కర్నాటక కాంగ్రెస్ నాయకుడు, కురుబ సంఘం అధ్యక్షుడు రవీంద్ర గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు.

By అంజి
Published on : 20 Aug 2024 6:50 AM IST

Congress worker collapses, live press meet, Bengaluru

లైవ్ ప్రెస్ మీట్‌లో.. కాంగ్రెస్ నాయకుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి

కోలార్ జిల్లాకు చెందిన కర్నాటక కాంగ్రెస్ నాయకుడు, కురుబ సంఘం అధ్యక్షుడు రవీంద్ర గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. సోమవారం బెంగళూరులోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇటీవల జారీ చేసిన ప్రాసిక్యూషన్ నోటీసుపై ఆయన మాట్లాడారు.

మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రవీంద్ర ఒక్కసారిగా కుర్చీలోంచి కుప్పకూలిపోయారు. వెంటనే అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటన జరిగినప్పుడు రవీంద్ర మైక్రోఫోన్‌ను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అతని ఫోన్ పడిపోవడంతో, అతను ఒక్కసారిగా వణికిపోయాడు. బ్యాలెన్స్ కోల్పోయాడు, తన సీటు నుండి పడిపోయాడు.

Next Story