మా ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్‌గాంధీనే: అశోక్ గెహ్లాట్
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీనే క్లారిటీ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 27 Aug 2023 5:16 AM GMTమా ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్‌గాంధీనే: అశోక్ గెహ్లాట్
లోక్‌సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయితే.. బీజేపీ తరఫున అయితే మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగానే కొనసాగుతారనే క్లారిటీ ఉంది. కానీ.. కాంగ్రెస్‌లో మాత్రం ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే కాంగ్రెస్‌లో ముఖ్యనేత అంటే రాహుల్‌గాంధీ. కానీ.. ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండే విషయంలో మాత్రం ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి అభ్యర్థి కాంగ్రెస్‌లో ఎవరనే దానిపైనా పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ క్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీనే క్లారిటీ ఇచ్చారు.
చర్చలు, సమాలోచనల తర్వాత 26 పార్టీల ఇండియా కూటమి ఈ నిర్ణయం తీసుకుందని అశోక్ గెహ్లాట్ చెప్పారు. ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక అంశాల ప్రభావం ఉంటుందని అన్నారు. అయితే.. దేశంలో ప్రస్తుతం అన్ని పార్టీలపైనా తీవ్రమైన ఒత్తిడి ఉందని చెప్పారు. ప్రజలు అలాంటి ఒత్తిడే సృష్టించారని అన్నారు గెహ్లాట్. అందుకే అన్ని పార్టీలతో ఓ కూటమి ఏర్పాటైందని తెలిపారు. బీజేపీ కేవలం 31 శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని.. మిగతా 69 శాతం మంది ప్రజలు వారికి వ్యతిరేకమని చెప్పారు. ఇక ఇండియా కూటమి బెంగళూరులో సమావేశం అయ్యిన తర్వాత ఎన్డీఏ కూటమిలో భయం మొదలైందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లను ఎన్డీఏ సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారనీ.. కానీ మోదీ ఎప్పటికీ అన్ని ఓట్లను సొంతం చేసుకోలేరని చెప్పారు. గతంలో మోదీకి ప్రజాదారణ ఉన్నప్పుడే ఎక్కువ శాతంలో ఓట్లు నమోదు కాలేదన్నారు. ఇక ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. దాంతో ఓట్ల శాతం ఎన్డీయేకు మరింత తక్కువే అవకాశం ఉందని అశోక్ గెహ్లాట్ జోస్యం చెప్పారు. ఇక కేవలం కాంగ్రెస్‌ను విమర్శించడం ద్వారానే మోదీ 2014లో అధికారంలోకి వచ్చారని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.